Monday, April 29, 2024

మూడేళ్ల జైలు శిక్ష సస్పెండ్.. సుప్రీంలో తమిళనాడు మంత్రికి భారీ ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యా శాఖ హాజీ మంత్రి కె పొన్ముడికి మద్రాసు హైకోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు సోమవారం సస్పెండ్ చేసింది. తగిన నియమ నిబంధనలపై పొన్ముడిని బెయిల్‌పై విడుదల చేయాలని ప్రత్యేక కోర్టును జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో 2016లో ప్రత్యేక కోర్టు పొన్ముడి దంపలుతను నిర్దోషులుగా తీర్పు ఇవ్వగా ఆ తీర్పును కొట్టివేసిన మ్రాసు హైకోర్టు పొన్ముడి, ఆయన భార్యకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ గత ఏడాది డిసెంబర్‌లో తీర్పు వెలువరిచింది.

2006 నుంచి 2011 వరకు ఉన్నత విద్య, గనుల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో పొన్ముడి ఆదాయానికి మించి అక్రమాస్లులు కలిగి ఉన్నారని విజిలెన్స్, అవినీతి నిరోధక శౠఖ(డివిఎసి) కేసు నమోదు చేసింది. ఈ కేసులో పొన్ముడి దంపతులను నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ డివిఎసి హైకోర్టులో అప్పీలుకు వెళ్లగా ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు పొన్ముడి దంపతులకు మూడేళ్ల కారాగార శిక్షను విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News