Friday, July 12, 2024

అమాత్యులు అయ్యేదెవరో ?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎంపిలతో సమావేశంతో పాటు కార్పొరేషన్ చైర్మన్‌ల ఖరారు, జూన్ 02వ తేదీన జరుగనున్న మంత్రివర్గ విస్తరణ, పిసిసి ఎంపికకు సంబంధించి ఢిల్లీలో అధిష్టానంతో సిఎం రేవంత్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో మొదటి రెండు రోజులు కొ త్తగా ఎంపికైన లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి సిఎం హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ ప ర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రాభివృద్ధిపై చర్చించి పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉం ది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అటు పార్టీలో ఇటు మంత్రివర్గంలో పదవులు ఆశిస్తున్న ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.జూలై 02 వ తేదీన మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ ముహూర్తం పెట్టినట్టుగా తె లిసింది. ఆలోపు మరికొంతమంది బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచారం.

లోక్‌సభ ఎన్నికలు ముగిసిపోవడం అధిష్టానం సై తం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పూర్తి స్థాయి కేబినెట్ కూ ర్పుపై పిసిసి ఫోకస్ పెట్టినట్లు కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పా ర్టీలోని పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రయత్నాలు కొనసాగిస్తుండగా అధిష్టానం మాత్రం వారి పనితీరును బట్టే ప దవులు ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై త్రీ మెన్ కమిటీ అధ్యయనం చేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం ఆశావహుల భవిష్యత్ తేల్చబోతున్నారన్న మాట వినిపిస్తోంది. ఈ క్ర మంలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్‌ఎస్ నుంచి వలసలు మొదలు కావడం సంచలన పరిణామంగా మా రింది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మరికొంత మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కేదెవరికి, నిరాశ మిగిలేదెవరికి అనేది ఆసక్తిగా మారుతున్నది.సిఎం, డిప్యూటీ సిఎంతో పాటు 11 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. మరో ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది.

ఇప్పటివరకు ప్రస్తుతం రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా నేతలకు కేబినెట్ లో ప్రాతినిథ్యం లేదు. ఈ క్రమంలో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో దానం నాగేందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరికతో వీరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశం అవుతోంది. అయితే చేరికల అంశం ఇలా ఉంటే మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ విస్తరణను చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో మంత్రి వర్గంలో ఆ వర్గానికి ప్రతినిధిగా ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇద్దరు ఓసిలు, ఇద్దరు బిసిలు, ఒక మైనార్టీ, మరొకటి లంబాడీలకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారితో పాటు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు కూడా మంత్రి పదవి కో సం పోటీ పడుతున్నారు. ఇప్పపటికే రాజ్యసభ సభ్యుడు కేకే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం గూటికి చేరారు.

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్న కారణంతో మరికొంత మంది ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, బాలు నాయక్, షబ్బీర్ అలీ, మల్ రెడ్డి రంగారెడ్డి, దానం నాగేందర్, ప్రేమ్‌సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్లు మంత్రి వర్గం రేసులో వినిపిస్తున్నాయి. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారిలో కేబినెట్ లోకి ఎంట్రీ దక్కుతుందా లేదా అనే ది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు తాజాగా కాంగ్రెస్‌లోకి మొదలైన చేరికల పర్వంతో సొంత పార్టీలోని ఆశావహులతో పాటు రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. దీంతోపాటు గతంలో 37 నామినేటెడ్ పోస్టులను సిఎం రేవంత్ భర్తీ చేయగా అందులో చాలామందిని మా ర్చాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీంతోపాటు మరిన్ని నామినేటెడ్ పోస్టులతో పాటు పలు డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News