కాంగ్రెస్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్‌పై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శారదకు బిజెపి మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. బిజెపి ఎంపి, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ‘సినిమాల్లో పిచ్చి వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదు’ అంటూ దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అంతేకాదు దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బిజెపి నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు సహించరని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మీద విమర్శలు గుప్పించిన ఢిల్లీ మాజీ ఎంఎల్‌ఎ తన్వీందర్ సింగ్ మీద ఇతర బిజెపి నాయకులపై సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టు, డిజిపిలు చర్యలు తీసుకోవాలంటూ దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కాగా దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.