Sunday, October 6, 2024

రైల్వే ట్రాక్‌పై టెలిఫోన్ స్తంభం..పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

రైల్వే ట్రాక్‌పై టెలిఫోన్ స్తంభాన్ని పైలట్ గుర్తించడంతో రైలు ప్రమాదం తప్పింది. బిలాస్‌పూర్ రోడ్‌రుద్రపూర్ సిటీ మధ్య రైల్వే ట్రాక్‌పై 6 మీటర్ల టెలిఫోన్ స్తంభాన్ని నైనీ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు లోకో పైలట్ గుర్తించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు ప్రమాదం తప్పి పోయిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 12.18 గంటల సమయంలో 12091 ట్రయిన్ నెంబరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు లోకోపైలట్ టెలిఫోన్ స్తంభాన్ని గుర్తించి రైలును ఆపేశాడు.

ట్రాక్‌పై స్తంభాన్ని తొలగించిన తరువాత రైలు బయలుదేరింది. ఇదే విధమైన విధ్వంసక చర్యల గురించి కొన్ని స్టేషన్ల ద్వారా ఫిర్యాదులు వచ్చాయి. రైలు సర్వీస్‌లకు విఘాతం కలిగించడానికి రైలు ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్లు, విరిగిన పట్టాలు, దుండగులు అడ్డుగా ఉంచుతున్న సంఘటనలు జరుగుతున్నాయని , దీనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News