Thursday, October 10, 2024

ఆ విషయంలో నా ఆలోచన పూర్తిగా మారిపోయింది: ఆలియా భట్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తన ప్రతి చిత్రంలో వైవిధ్యతను కనబరుస్తూ స్టార్ హీరోలకు ధీటుగా బాలీవుడ్ లో ఆలియా రాణిస్తోంది. 2012లో స్టూ డెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆలియా తన కెరీర్ కోసం పూర్తిగా బరువు తగ్గించుకుంది. తన శరీరాకృతి కోసం డైటింగ్ చేసి మంచి ఫిజిక్‌తో కనిపించింది. సినిమా కెరీర్ కోసం ఎట్టి పరిస్థితుల్లో డైటింగ్ ఆపలేదు.

స్వతహాగా కాస్త బొద్దుగా ఉండే ఆలియా ఇండస్ట్రీలో అడుగు పెట్టాక సన్నగా మారింది. ఈ విషయాన్ని తానే స్వయంగా తెలియజేసింది. అయితే తల్లిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత తన శరీరాన్ని గౌరవించడం నేర్పించిందట. కేవలం సన్నగా ఉండడం మాత్రమే జీవిత గమ్యం కాదు అన్న విషయాన్ని తెలుసుకున్నానని ఆలియా చెప్పింది. శరీరాకృతి విషయంలో తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని ఆలియా పేర్కొంది. అలియా నటిస్తున్న జిగ్రా మూవీ అక్టోబర్ 11న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News