Tuesday, October 15, 2024

కారులో విద్యార్థినిపై ప్రిన్సిపాల్ హత్యాచారం?

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: కారులో విద్యార్థినిపై ప్రిన్సిపాల్ అత్యాచార చేయడానికి ప్రయత్నించడంతో బాలిక ప్రతిఘటించింది. ఈ క్రమంలో బాలిక గొంతు నులిమి చంపేసి అనంతరం మృతదేహాన్ని స్కూల్ వెనుక పడేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం దాహోద్ జిల్లా సింగ్వాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గోవింద్ నాథ్ అనే పంతులు ఓ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. 10.20 నిమిషాలకు గోవింద్ తన కారులో స్కూల్ కు వెళ్తుండగా బాలికను(06) తీసుకెళ్లాలని ప్రిన్సిపాల్‌ను తల్లి బతిమాలింది. దీంతో ఆరేళ్ల బాలికను కారులో ఎక్కించుకున్నాడు. మార్గం మధ్యలో బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా విద్యార్థిని ప్రతిఘటించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని వెంటనే బాలిక గొంతునులిమి చంపేశాడు. బాలిక మృతదేహాన్ని కారులో డిక్కీలో పడేసిన అనంతరం స్కూల్ కు వెళ్లాడు. ఎవరు లేని సమయంలో కారు డిక్కీలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి స్కూల్ వెనుక బాగంలో పడేశాడు. స్కూల్ బ్యాగ్, చెప్పులు తరగతి గదిలో పడేశాడు. సాయంత్రం కూతురు ఇంటికి రాకపోవడంతో గ్రామంలో తల్లిదండ్రులు వెతికారు. పాఠశాల ఆవరణంలో వెతకగా స్కూల్ వెనుకభాగంలో బాలిక మృతదేహం కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్‌ను గోవింద్‌నాథ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తానే చంపినట్లు ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News