Sunday, December 15, 2024

జార్ఖండ్ లో గెలుపు దిశగా కాంగ్రెస్ కూటమి!

- Advertisement -
- Advertisement -

రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మొదటి దశలో నవంబర్ 13న 43 స్థానాలకు, నవంబర్ 20న రెండో దశలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 41. ప్రస్తుతం కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఇలాగే కొనసాగితే ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.

గండే నియోజకవర్గంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇక ధన్వార్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండి, సరాయ్ కెలాలో మాజీ సిఎం చంపయీ సోరెన్, ఇస్లాంపూర్ లో ఎన్ సిపి అభ్యర్థి జయంత్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News