Sunday, September 15, 2024

సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్ధిపేట ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణమైన విషయమని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు మండిపడ్డారు. ఈ దాడి పట్ల తన ట్విట్టర్ లో హరీష్ రావు రెండు వీడియోలను పోస్టు చేశారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయమని ధ్వజమెత్తారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు.  పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమని చురకలంటించారు. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డిజిపి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News