Saturday, April 20, 2024

నల్లగొండలో రెండు వేల ఇండ్లు మంజూరు చేస్తాం: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: ఇప్పటికే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్లగొండలో విస్తృతంగా పర్యటిస్తూ ఐదేళ్లలోపు చిన్నారులకు మంత్రి కోమటిరెడ్డి పోలియో చుక్కలు వేశారు. గృహజ్యోతి లబ్ధిదారులతో మంత్రి కోమటిరెడ్డి ముచ్చటించారు. బైక్‌పై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని, నల్లగొండలో తొలుత రెండు వేల ఇళ్లు మంజూరు చేస్తామని, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షాలు చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. తెలంగాణను కెసిఆర్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News