Wednesday, September 11, 2024

సుల్తానాబాద్ లో దేవాలయం భూమి కబ్జా.. ప్రశ్నించినందుకు దాడి చేసిన కాంగ్రెస్ నాయకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని హనుమాన్ దేవాలయం భూమిని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు, ఈ క్రమంలో వారిపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేశాడు. సుల్తానాబాద్ స్థానిక కాంగ్రెస్ నాయకుడు గజబింకర్ శంకర్ భూమి కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దేవాలయం భూమిని ఎలా కబ్జా చేస్తారని ప్రశ్నించినందుకు బిఆర్ఎస్ మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ ఎండి. రఫీక్ పై గజబింకర్ శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు, 10వ వార్డుకు సంబంధించిన హనుమాన్ దేవాలయం భూమి కబ్జా, రోడ్లు వెడల్పు కార్యక్రమంలో జరిగిన అవకతవకలపై బిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతుండగా వారిపై సీనియర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు గజబింకర్ జగన్ తనయుడు గజబింకర్ శ్రీనివాస్ దాడి చేశారు. రఫీక్ ముఖంపై శ్రీనివాస్ పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News