Thursday, May 2, 2024

ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభం.. భారత వైఖరిపై కాంగ్రెస్ అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య నెలకొన్న సంక్షోభంపై భారత వైఖరి విషయంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ పరిస్థితులపై ,ఈ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీరు మొదటి నుంచి భిన్నంగా ఉందని, తప్పు పట్టింది. గాజా ఆస్పత్రిపై దాడి ఘటన తనకెంతో దిగ్భ్రాంతిని కలిగించిందంటూ ప్రధాని మోడీ పేర్కొన్న తరుణంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. “ పాలస్తీనా వాదాన్ని బలపరచడంతోపాటు, హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటానికి గతంలో భారత్ మద్దతుగా నిలిచేది.

అయినప్పటికీ ఏదైనా దాడులు, ప్రతిదాడుల విషయానికొస్తే వాటిని తీవ్రంగా ఖండించేది.కానీ దురదృష్ట వశాత్తు ప్రస్తుతం భారత వైఖరి మాత్రం యుద్ధానికి ముగింపు పలికేలా లేదు. ఇటువంటి తరుణంలో ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంపై భారత్ తన వైఖరిని హుందాగా , గౌరవ ప్రదమైన రీతిలో వెల్లడించాలి ” అని వేణుగోపాల్ పేర్కొన్నారు. “ యుద్ధంలో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం, గాజా లోని ఆస్పత్రిపై జరిగిన దాడిలో వందల సంఖ్యలో పాలస్తీనీయులు మరణించిన ఘటనను ఖండించాల్సిందే.

మరోవైపు , హమాస్ బృందాలు పాల్పడుతున్న దుశ్చర్యలు సమర్థించలేనివి. ఇదే సమయంలో ఈ పరిస్థితులకు దారి తీసిన చారిత్రక నేపథ్యాన్ని పరిశీలించడం కూడా ఎంతో అవసరం. గాజాను పూర్తిగా నాశనం చేయడానికి ఇజ్రాయెల్ చేసే ప్రయత్నాలకు కొన్ని దేశాలు మద్దతు పలకడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇజ్రాయెల్ లేదా పాకిస్థాన్… రెండు దేశాలూ అంతర్జాతీయ మానవతా చట్టాలకు లోబడి ఉండాలి ” అని కేసీ వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News