Monday, October 14, 2024

ముషీరాబాద్ లో కెటిఆర్ కారుపై కాంగ్రెస్ నాయకుల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
కారుపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ముషీరాబాద్ లో కెటిఆర్ కారును అడ్డుకుని కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కెటిఆర్ కారుపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను బిఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేయడమేనా ప్రజాపాలన అంటే?… ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?… అని బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని, ఆ పార్టీని ప్రజలు మూసీలో కలపడం ఖాయమని బిఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News