Tuesday, April 16, 2024

ధూమపానంతో సిఓపిడి.. లక్షణాలు ఇవే..

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సిఓపిడి గురించి అవగాహన లేకుండా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఓపిడితో ఇబ్బంది పడుతున్నవారు ఈవ్యాధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. సిఓపిడి అనేది క్రానిక్ అబ్స్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇది ఊపిరితిత్తుల నుండి వాయు ప్రసరణకు ఆటంకం కలిగిస్తుందని అంతర్జాతీయ పల్మోనాలజిస్ట్ డా. కిషన్ శ్రీకాంత్ జువ్వా పేర్కొన్నారు.

అలాగే ఊపిరితిత్తుల పరేన్చైమా, రక్తనాళాల నష్టం కలిగిస్తుంది. ఊపిరితిత్తులు కాలక్రమేణా మరింత దెబ్బతినడంతో, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. సిఓపిడి అనే పదం దీర్ఘకాలిక బ్రోన్కైటిస్, ఎంఫిసెమా కూడా కలిగి ఉంటుంది. సిఓపిడి ఇప్పుడు మరణాలకు మూడవ ప్రధాన కారణమని అభివృద్ది చెందుతున్న దేశాల్లో తక్కువ ఆదాయ దేశాల్లో మరణాలు సార్వసాధారణం. రాబోయే సంవత్సరాల్లో సిఓపిడి భారం పెరుగుతుందని అంచనా వేయబడిందన్నారు. ఏటా దాదాపు 30లక్షలమంది మరణిస్తున్నట్లు చెప్పారు.

సిఓడిపి ఎవరికి వచ్చే ప్రమాదం ఉంది 

సిగరేట్, బీడి, సిగార్, గంజాయివంటి ఏరకమైన పొగాకు ఉత్పత్తులను దూమ పానం చేయడం. వాయుకాలుష్యం, బయో మాస్ ప్యూయల్ ఎక్సోజర్, సేంద్రీయ, అకర్బన దూళి, రసాయన, పొగల భారినపడేవారు.

సిఓపిడి లక్షణాలు : కఫం రావడం, శ్వాస ఆడకపోవడం, గురక, ఛాతీ బిగుతూ, ఆలసటతో దగ్గు ఉంటాయి. దీనికి ఇన్హేల్డ్ థెరపీ అనేది సిఓపిడి చికిత్సకు ఉత్తమ మార్గం, ఎందుకు పీల్చే మందుల వ్యాధి ప్రదేశానికి నేరుగా వెళ్తాయి. అందువల్ల నోటి ద్వారా తీసుకునే మందులతో పోల్చితే అవి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్వీయ వైద్యం చేయవద్దు, పల్మోనాలజిస్టు సూచించిన మందులను మాత్రమే తీసుకోవాలని సూచించారు.

గోల్డ్ ఇంటర్నేషనల్ మార్గదర్శకాల ప్రకారం సిఓపిడి అనేది నివారించదగిన, చికిత్స చేయగల వ్యాధి. దూమపానం చేసే వారైతే, వెంటనే ధూమపానం మానేయాలి. దూమపానం ఆపడానికి సహాయం కావాలి. పల్మోనాలజిస్టులను సంప్రదించాలి. కాలుష్యం, దుమ్ములు, వాయువులు, ఆవిరి, పొగాలకు దూరంగా ఉండాలి. ప్రతి రోజు వ్యాయామం చేయాలి. వయస్సు, ప్రమాద కారకాలపై ఆధారపడి తీవ్రమైన ఇన్పెక్షన్లను నివారించడానికి ఇన్ప్లుఎంజా, న్యూమోకాకల్ వ్యాక్సిన్‌తో టీకాలు వేయడం అవసరమని పేర్కొంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News