Friday, April 26, 2024

ట్రాన్స్‌జెండర్స్ కోసం నేషనల్ పోర్టల్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ / హైదరాబాద్ : ట్రాన్స్ జెండర్స్ (లింగమార్పిడి) కోసం కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ https://transgender.dosje.gov.in లో ట్రాన్స్‌జెండర్స్ తమ పేర్లను నమోదు చేసుకోవాలని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. శైలజ ఒక ప్రకటనలో సూచించారు. లింగ మార్పిడి వ్యక్తులు (ట్రాన్స్‌జెండర్స్) హక్కుల రక్షణ చట్టం 2019 ను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని, చట్టంలోని నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం “ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) నియమాలు 2020ని కూడా సిద్దం చేసిందని పేర్కొన్నారు.

లింగమార్జిడి వ్యక్తులు స్కాలర్‌షిప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్, కాంపోజిట్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, టిజి సర్టిఫికెట్, ఐడెంటిటి కార్డు వంటి సంక్షేమ పథకాలను పొందేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ వన్ స్టాప్ పోర్టల్‌ను ప్రారంభించిందన్నారు. ఆ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ప్రతి దరఖాస్తు దారుడు పథకాల ప్రయోజనాలను పొందేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నెంబర్ (యూనిట్ రిజిస్ట్రేషన్ నెంబర్) ను అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ట్రాన్స్ జెండర్స్ ఆ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శైలజ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News