Home తాజా వార్తలు జనం రద్దీతో ర్యాపిడ్ టెస్టుల ఫలితాలు ఆలస్యం

జనం రద్దీతో ర్యాపిడ్ టెస్టుల ఫలితాలు ఆలస్యం

రెండు రోజుల తరువాత వెల్లడిస్తున్న కేంద్రాల సిబ్బంది
పాజిటివ్ ఉన్న వారికే ఫోన్ చేసి
చెబుతున్న వైద్యులు
స్థ్దానిక నేతల సిఫారసు చేసిన
వారికే త్వరగా పరీక్షలు
గంటల తరబడి క్యూలో
నిలబడుతున్న సామాన్య ప్రజలు

Corona results delayed with rapid test

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో థర్డ్‌వేవ్ కరోనా మహమ్మారి విశ్వరూపం దాల్చడంతో ప్రజలు వైరస్ లక్షణాలు రావడంతో సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. గత నెల రోజుల నుంచి వైద్య సిబ్బంది సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు టెస్టులు చేస్తున్నారు. నగరంలో పట్టణ అర్భన్ కేం ద్రాల్లో రోజుకు 100 మంది చొప్పన రక్తనమూనా లు సేకరించి 30 నిమిషాల్లో ఫలితాలు వెల్లడించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో మొన్నటివరకు సకాలంలో పరీక్షలు చేశారు. మూ డు రోజుల నుంచి కేంద్రాలు పెద్ద ఎత్తున జనం ఎ గబడంతో ఆరగంటలో వచ్చే ఫలితాలు రెండు రోజులకు వెల్లడిస్తున్నట్లు స్థ్దానిక ప్రజలు వాపోతున్నారు.

AP Reports 154 new corona cases in 24 hrs

ప్రభుత్వ ఉచితంగా టెస్టులు చేస్తుందని వ స్తే నిరాశ మిగిలిందని, కొన్నిచోట్ల స్థ్దానిక రాజకీ య నాయకులు తమ అనుచరులు వచ్చారని వారి కి ముందుగా పరీక్షలు చేయాలని సూచించడంతో సామాన్య ప్రజలకు గంటల తరబడి నిలబడే పరిస్థి తి ఏర్పడిందని వాపోతున్నారు. గత 20 రోజుల నుంచి రోజుకు సగటున 1200నుంచి 1500 పాజటివ్ కేసులు నమోదై నగర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దీంతో ఏమాత్రం దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రజ లు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకునేందుకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రులు టెస్టులు చేస్తూ వేల రూపాయలు దండుకుంటున్నారు. దీని గుర్తించి అధికారులు ప్రభుత్వ మే ఉచితంగా పరీక్షలు చేయాలని భావించిన గ్రేట ర్ మూడు జిల్లాల పరిధిలో 120 ఆరోగ్య కేం ద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తుంది. కరోనా ప రీక్షల కోసం ఎక్కువగా ముషీరాబాద్, మలక్‌పేట, రాయదుర్గం, శేరిలింగంపల్లి, బాలాపూర్, సరూర్‌నగర్, జమ్మిగడ్డ, హపీజ్‌పేట, కూకట్‌పల్లి, వనస్థ్దలిపురం, అల్వాల్, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, గొల్కొండ, చాంద్రాయణగుట్ట, చాదర్‌ఘాట్ వంటి ఆరోగ్య కేంద్రాలకు వస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తే సగం మందికి పైగా పాజిటివ్ వస్తున్నట్లు ఫలితాలు వెల్లడిస్తున్నారు. సామాన్యప్రజలు కరోనా టెస్టుల విషయంలో వైద్యులు నిర్లక్షం చేస్తున్నారనే విమర్శలు చేయడం కా-దని పియుసి కేంద్రాల వైద్యులు పేర్కొంటున్నారు. రోజుకు 70మందికి చేయాల్సి ఉండగా, సెంటర్ల వద్దకు 200మందివరకు రావడంతో అందరి రక్తనమూనాలు సేకరించడంతో కొంత ఆలస్యమైతుందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సి అవసరం లేదని, ప్రతి ఒకరి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంటున్నారు.