Home తాజా వార్తలు జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు

జీవన ప్రమాణాలే లక్ష్యంగా పార్కుల ఏర్పాటు

hyderabad parks open

మన తెలంగాణ /సిటీ బ్యూరో : హైదరాబాద్ నగర వాసులకు ఆహ్లాదకరంతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించి మెరుగైన జీవన ప్రమాణాల ను అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలను చేపట్టింది. నగరంలో పెరుగుతున్న వాహన, పరిశ్రమ ల కాలుష్యంతో వాతావరణంలో పెను మార్పులు సంభవించి, ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గుదల మూలంగా వాతావరణ సమతుల్యత లేక తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురువుతున్న విషయం తెలిసిందే.. ఈ సమస్యకు కొంతలో కొంత చెక్ పెట్టేందుకు గ్రేటర్ వ్యాప్తంగా జిహెచ్‌ఎంసి ఎక్కడికక్కడ ఇందులో భాగ ంగా పట్టణ పార్కులను అభివృద్ధ్దికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా అటవీశాఖ, జిహెచ్‌ఎంసి సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పట్టణ, అట వీ పార్కులను ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ, అటవీ పార్కుల ఆహ్లాదకరంగా అందరినీ ఆకట్టుకునే విధంగా తీర్చి దిద్దడం తో పాటుగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రాంతంలో పట్టణ పార్కులకు వివిధ రకాల పేర్లతో ఏర్పాటు చేసి, అన్ని రకాల సౌకర్యాలు వసతులు కల్పింస్తోంది.
అటవీ, పట్టణ పార్కులతో
వాతావరణంలో మార్పులు
గాజుల రామారం, సూరారం, బౌరంపేట్ పరిధిలో 454 హెక్టార్ లలో అటవీ ప్రాంతంలో గాజులరామా రం లోని 60 ఎకరాల్లో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయడమే కాకుండా అన్ని హం గులతో మెరుగైన వసతులు కల్పించారు. ఈ పార్కును పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మం త్రి కేటీఆర్ ఇటీవల ప్రారంభించారు.ఆకర్షణీయంగా ముఖ ద్వారం ఏర్పాటు చేశారు. వాకింగ్, సైక్లింగ్ ట్రా క్, వాష్ రూమ్స్, యోగ షెడ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, రెం డు ఓపెన్ క్లాస్ రూలు, పిక్నిక్ ఏరియా ఏర్పాటు చేశా రు. ఈ పార్కుల ఏర్పాటు ద్వారా స్థానిక పరిసర ఉష్ణోగ్రతలను 3 నుండి 5 సెంటి గ్రేడ్ తగ్గే అవకాశం ఉం ది. అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా చెట్లు నాటినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విషయం అందరికీ తెలిసిందే.

నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం

Panchatatva park created in Telangana
నగరంలో నివసించే ప్రజలకు సైతం మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఫ్లై ఓవర్ కింద కూడా సుందరీకరణలో భాగంగా పార్కులను తీర్చిదిద్దుతున్నారు. దీంతోవాహన కాలుష్యం కొంతతగ్గుముఖం పట్టింది. అదేవిధంగా ప్రధాన కూడళ్లు, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ తో పాటుగా పచ్చదనం కోసం అనువైన స్థలంలో మొక్కలు నాటుతున్నారు.ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో 5 ఎకరాల పైన ఎక్కువగా ఉన్న 19 మేజర్ పార్కులను తీర్చిదిద్దారు. మరో 17 వివిధ థీమ్ పేరుతో పార్కులను ఏర్పాటు చేయడమే కాకుండా సమర్థవంతగా నిర్వహిస్తున్నారు. వృక్ష సంపదను పెంపొందించడం, పరిసర ప్రాంతాలకు చక్కటి వాయువును అందించడం తో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించే సాంప్రదాయ ఆటల పట్ల భావి తరాల వారికి ఆసక్తి కనబర్చేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే 919 కాలనీల్లో పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు నివాసిత ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలంల్లో కొత్తగా పార్కులను అభివృద్ది పర్చి వాటిని నిర్వహణ బాధ్యతలను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగించారు.

KTR inaugurates Panchatatva park in Hyderabad
కొత్తగా56 థీమ్ పార్క్ ల ఏర్పాటు
నగరంలో వివిధ రకాల పార్కులకు అదనంగా మరో 56 థీమ్ పార్క్ ల ను జిహెచ్‌ఎంసిశ్రీకారం చుట్టింది. స్పోర్ట్, తెలంగాణ స్ఫూర్తి పార్క్, మల్టీ జనరేషన్ పార్క్, ఉమెన్ థీమ్ పార్క్ పనులు ప్రారంభం కాగా ఇందులో ఇటీవల గాజుల రామారం లోని టి.ఎస్. ఐ.ఐ.సి కాలనీ లో ఏర్పాటు చేసిన స్పోర్ట్ థీమ్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వివిధ ప్రగతి దశలో ఉన్న మొత్తం 56 థీమ్ పార్క్ లను ఈ సంవత్సరం చివరి వరకు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఆదే విధంగా తెలంగాణ స్ఫూర్తి, మల్టీ జనరేషన్ పార్క్, ఊమెన్ పార్క్, చిల్డ్రన్ థీమ్ పార్క్ ల పేర్ల తో జిహెచ్‌ఎంసి పరిధిలో ఏర్పాటు చేయనున్నారు.