Sunday, October 1, 2023

బండ్లగూడలో తీవ్ర విషాదం.. అనాథలైన ముగ్గురు పిల్లలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంట్లో నీటి పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన దంపతులు మృతి చెందిన విషాద సంఘన బండ్లగూడలో శనివారం చోటుచేసుకుంది. మృతులు తన్వీర్ (36), అతని భార్య షకీరా బేగం గుర్తించారు. వారు ముగ్గురు పిల్లలతో కలిసి గత కొన్నేళ్లుగా బండ్లగూడలోని గౌస్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షకీరా బేగం తన ఇంట్లో ఉన్న నీటి పంపును ఆన్ చేసేందుకు ప్రయత్నించగా, విద్యుదాఘాతానికి గురైంది.

ఆ దృశ్యాన్ని గమనించిన తన్వీర్ ఆమెను రక్షించేందుకు పరుగెత్తాడు. అయితే విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వారిద్దరూ కుప్పకూలిపోవడంతో ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News