Thursday, March 28, 2024

మహారాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం మొదలైంది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత బాలాసాహెబ్ థోరట్ తన పదవికి రాజీనామా చేశారు. పిసిసి అధ్యక్షుడు నానా పటోలే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని, ఆయనతో కలిసి తాను పని చేయలేనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ నెల 2న ఆయన లేఖ రాసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలాసాహెబ్ థోరట్ సన్నిహితులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. తనను పటోలే ఏ విధంగా అవమానించారో థోరట్ లేఖలో వివరించారు. తన కుటుంబ సభ్యులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సత్యజిత్ టంబే ఎంఎల్‌సి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఉద్దేశపూర్వకంగానే మితిమీరి మాట్లాడారని ఆరోపించారు. ఇటీవల శాసన మండలి జరిగిన నాసిక్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించిన సత్యజిత్ టంబేకు థోరట్ మేనమామ.

అయితే టంబే తండ్రి సుధీర్‌ను కాంగ్రెస్ ఈ ఎన్నికల బరిలో నిలిపింది. సత్యజిత్ టంబే గెలిచిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ముందుగానే కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి తెలియజేశానని, అయినప్పటికీ తనకు తప్పుడు ఫారాలను ఇచ్చారని ఆరోపించారు. తన మేనమామ థోరట్‌కు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు, తమ కుటుంబాన్ని కాంగ్రెస్‌కు దూరం చేసేందుకు కుట్ర జరుగుతోందని పటోలే దుయ్యబట్టారు.అయితే థోరట్ వ్యాఖ్యలపై పిసిసి చీఫ్ నానా పటోలే మండిపడ్డారు. తానెప్పుడు అలాంటి డర్టీ పాలిటిక్స్ చేయలేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో సంక్షోభాన్ని అందిపుచ్చుకోవాలని బిజెపి చూస్తోంది. బాలాసాహెబ్ థోరట్‌కు బిజెపి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆ పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాన్‌కులే ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News