Saturday, July 27, 2024

తెలంగాణకు ఎక్కువ డోసులివ్వండి

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు ఎక్కువ డోసులు ఇవ్వండి
భారత్ బయోటిక్ సిఎండిని కోరిన సిఎస్ సోమేష్‌కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్: కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనన్ని ఎక్కువ డోసులు అందించాలని భారత్ బయోటెక్ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత్ బయోటెక్ ప్రతినిధులతో మంగళవారం సిఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ భేటికి భారత్ బయోటెక్ ఎండి కృష్ణ ఎల్ల, ఇతర ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు భారత బయోటెక్ సిఎండితో చర్చలు జరిపినట్లు సిఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. కొవిడ్ 19 వ్యాప్తి నివారణకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని, ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేపట్టడానికి తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక డోసులను సరఫరా చేయాలని భారత్ బయోటిక్ సిఎండిని కోరామని తెలిపారు. ఈ విషయంపై భారత్ బయోటెక్ సంస్థ సిఎండి సానుకూలంగా స్పందించారని సిఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డాక్టర్ సాయి ప్రసాద్‌లు పాల్గొన్నారు.

CS Somesh Kumar meeting with Bharat Biotech Officials

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News