Sunday, May 12, 2024

యాంకర్ శ్యామల భర్త అరెస్టు

- Advertisement -
- Advertisement -

Anchor Shyamala husband arrested

 

కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు
నర్సింహారెడ్డి, మరో మహిళను అరెస్టు చేసిన రాయదుర్గం పోలీసులు

మనతెలంగాణ, హైదరాబాద్ : డబ్బులు తీసుకుని మోసం చేసిన కేసులో యాంకర్ శ్యామల భర్త, మరో మహిళను రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి 2017లో తమ వద్ద కోటి రూపాయలు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. తిరిగి డబ్బులు చెల్లించమని అడిగితే బెదిరింపులకు దిగాడని, లైంగికంగా వేధింపులకు గురిచేశాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంలో సెటిల్ చేసుకోవాలని నర్సింహారెడ్డి తరఫున మరో మహిళ రాయబారం నడిపిందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నర్సింహారెడ్డి, రాయబారం నడిపిన మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News