Saturday, April 20, 2024

మహబూబాబాద్ జిల్లాలో అమెరికా కూరగాయల సాగు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం శివారు కొత్తగూడెంలో రైతు కందాడి అశోక్ రెడ్డి ప్రయోగాత్మకంగా జుకిని కూరగాయ సాగు చేస్తున్నారు. తమ బంధువుల ద్వారా అమెరికా నుంచి 100 విత్తనాలను తెప్పించి పండించినట్లు తెలిపారు.

పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఈ కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయన్నారు. ఒక్కో కాయ బరువు 200గ్రాముల వరకు ఉంటుందని, ఒక్కొ చెట్టుకు కిలో నుంచి రెండు కిలోల వరకు కాయలు కాస్తాయని చెప్పారు. కిలో ధర రూ. 150 నుంచి 200 వరకు ఉంటుందని వెల్లడించారు. అమెరికా, కెనడా దేశాల్లో ఎక్కువగా ఈ జుకినీ కూరగాయలను పండిస్తారని తెలిపారు. జుకినిలో ఫోలేట్, పొటాషియం, ప్రొవిటమిన్ లతో కూడిన మంచి పోషక పదార్థాలను కలిగి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News