Friday, April 26, 2024

మినీ ట్రక్ ఏస్ డెలివరీని ప్రారంభించిన టాటా మోటార్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశీయ వాణిజ్య వాహన తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ అధునాతన, జీరో- ఎమిషన్, ఫోర్ వీల్ చిన్నతరహా వాణిజ్య వాహనాల్లో సరికొత్త ఏస్ ఇవిని ప్రారంభించింది. దీని ధర రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూం) అని కంపెనీ ప్రకటించింది. కంపెనీ ఇంట్రా-సిటీ కార్గో ట్రాన్స్ పోర్ట్‌కు సుస్థిరదాయకత మొబిలిటీ పరిష్కారాలు అందించడంలో గణనీయ ముందడుగు వేసింది.

అగ్రగామి ఇ-కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, కొరియర్ కంపెనీలు, వాటి లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన అమెజాన్, డెలివరీ, డీహెచ్‌ఎల్ (ఎక్స్ ప్రెస్ అండ్ సప్లయ్ చెయిన్), ఫెడ్ ఎక్స్, ఫ్లిప్ కార్ట్, జాన్సన్ అండ్ జాన్సన్ కన్జ్యూమర్ హెల్త్, మూవింగ్, సేఫెక్స్ ప్రెస్, ట్రెంట్ లిమిటెడ్ లకు విప్లవాత్మక ఏస్ ఈవీలు డెలివరీ చేసింది. ఏస్ ఈవీల మొదటి ఫ్లీట్ ను టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గిరీశ్ వాఘ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ రహదారులపై ఏస్ ఈవీలను ప్రవేశపెట్టడం అనేది ఉద్గారాలు లేని సరుకు రవాణా దిశగా ఒక పెద్ద ముందడుగు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News