Sunday, April 28, 2024

టాటా మోటార్స్ @ రూ.3 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : రూ.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన టాటా గ్రూప్‌లో మూడో కంపెనీగా టాటా మోటార్స్ నిలిచింది. కంపెనీలో టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ రూ.2,73,985 కోట్లు, టాటా మోటార్స్ డివిఆర్ రూ.27,940 కోట్ల మార్కెట్ క్యాప్‌తో కలిపి ఉంది. ఇంతకుముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), టైటాన్ మార్కెట్ క్యాప్ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటాయి. టాటా మోటార్స్ షేర్లు మంగళవారం (జనవరి 16) 1.11 శాతం పెరుగుదలను చూశాయి. కంపెనీ షేర్లు రూ.827 కు చేరడం ద్వారా 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.

దీంతో దీని మార్కెట్ క్యాప్ రూ.3.01 లక్షల కోట్లకు పెరిగింది. టాటా మోటార్స్ ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 4 శాతం రాబడిని ఇచ్చింది. గత ఒక నెలలో ఇది దాదాపు 12.42 శాతం లాభపడగా, కంపెనీ స్టాక్ గత ఆరు నెలల్లో 32.84 శాతానికి పైగా లాభపడింది. ఏడాదిలో కంపెనీ 98.93 శాతం రాబడిని ఇచ్చింది. టాటా గ్రూప్ కంపెనీల్లో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ టిసిఎస్‌కు ఉంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.14 లక్షల కోటు, ఇక కాగా టైటాన్ మార్కెట్ క్యాప్ రూ.3.41 లక్షల కోట్లుగా ఉంది.

ఐదు రోజుల లాభాలకు బ్రేక్
దేశీయ స్టాక్‌మార్కెట్ల ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. మంగళవారం ఐటి, రియాల్టీతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి స్టాక్స్‌లో నష్టాల కారణంగా మార్కెట్లపై ప్రభావం కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు పడిపోయి 22,032 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 199 పాయింట్లు పతనమై 73,128 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 22,124 పాయింట్లను, అలాగే సెన్సెక్స్ 73,427 పాయింట్లను తాకింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉండగా, ఐటి రంగంలో సానుకూల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో లాభాల స్వీకరణ వచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News