Thursday, January 26, 2023

అత్తగారింట్లో సొమ్మును ప్రియుడితో చోరీ చేయించిన కోడలు

- Advertisement -

Lovers
యాదాద్రి భువనగిరి: అత్తగారింట్లో సొమ్మును తన ప్రియుడితో కోడలు చోరీ చేయించిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలో లింగంపల్లి నర్సింహా తన కుమారుడు, కోడలితో కలిసి ఉంటున్నాడు. నర్సింహా ఇంట్లో ఏప్రిల్ 25న చోరీ జరిగింది. పుట్టపాక గ్రామానికి చెందిన రాము, నర్సింహ కోడలు లింగంపల్లి భాగ్యతో వివహేతర సంబంధం నడిపిస్తున్నాడు. వీరి జల్సాలకు డబ్బులు అవసరం ఉండడంతో తన అత్తగారింట్లో దొంగతనం చేయాలని రాముకు సూచించింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో రాము ఇంట్లోకి వచ్చి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. భాగ్య ఇచ్చిన సమాచారం తేడాలు కనిపిస్తుండడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించగా రాము అనే యవకుడు దొంగతనం చేశాడని తెలిపింది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ యుగంధర్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles