Friday, December 6, 2024

దావూద్ ఆస్తుల వేలం..

- Advertisement -
- Advertisement -

ముంబై : అజ్ఞాతంలో ఉన్న దావూద్ ఇబ్రహీం ఆస్తులు శుక్రవారం వేలానికి రానున్నాయి. మొత్తం నాలుగు దావూద్ ఆస్తులకు ఆరంభ బిడ్ రూ 19 లక్షలుగా అధికారులు ఖరారు చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబాకే గ్రామంలో ఈ డాన్ పూర్వీకుల ఆస్తులు ఉన్నాయి. వీటి వారసుడు దావూదే. ఇప్పటి వేలం పాటలో ఎంత మంది పాల్గొంటున్నారు? ఏ మేరకు ధర పలుకుతుంది? అనేది స్పష్టం కాలేదు. అయితే స్థానిక ప్రముఖ లాయరు, శివసేన సభ్యులు అజయ్ శ్రీవాత్సవ తప్పనిసరిగా ఈ వేలంలో పాల్గొంటారని భావిస్తున్నారు. గతంలో ఆయన ముంబాకే గ్రామంలో దావూద్ పుట్టి పెరిగిన ఇంటిని ఇంతకు ముందటి వేలంలో తనదిగా చేసుకున్నారు. దావూద్ ఆస్తులను చేజిక్కించుకుని వాటిలో సనాతన ధర్మాల విద్యాలయాలు ఏర్పాటు చేయాలనేదే తన తపన అని శ్రీవాత్సవ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News