Saturday, July 26, 2025

వెంకిర్యాల వాగులో డిసిఎం బోల్తా

- Advertisement -
- Advertisement -

గారెడ్డి జిల్లా, కొందుర్గు మండల పరిధిలోని వెంకిర్యాల గ్రామ శివారుల్లో గల వెంకిర్యాల వాగులో శుక్రవారం డిసిఎం బోల్తా పడింది. ఈ సంఘటనలో పెను ప్రమాదం తప్పగా, డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. గత కొన్ని రోజుల నుండి నిరంతరాయంగా వర్షాలు పడుతుండడంతో వాగు నిండుగా ప్రవహిస్తోంది.. గతంలో ఉన్న బ్రిడ్జును గత గ ప్రభుత్వ హయాంలో నూతన హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 2023 సంవత్సరంలో పాతబ్రిడ్జిని కూల్చి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఇరుకుగా ఉండడంతో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో కర్ణాటకలోని హుబ్లీ నుండి రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండల కేంద్రంలో ఓ పేపర్ పరిశ్రమకు వేస్ట్ పేపర్‌ను తీసుకొని మహబూబ్‌నగర్ నుండి వయా నవాబుపేట్ మీదుగా వస్తున్న డిసిఎం వెంకిర్యాల వాగు వద్దనే రాగానే అకస్మాత్తుగా వాగులో పడిపోయింది.

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ శివ రుద్రయ్యతోపాటు క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రవిందర్ నాయక్‌తోపాటు రెవెన్యూ, పంచాయతీ అధికారులు పరిశీలించారు. కొందుర్గు నుండి వయా రాయచూర్ వెళ్లాంటే దగ్గర కావడంతో నిత్యం ఈ రోడ్డు మీదుగా వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం తంగళ్ళపల్లి, వెంకిర్యాల, కొల్లూర్ , నవాబ్‌పేట్, మహబుబ్‌నగర్ తదితర గ్రామాలకు వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. నూతన హైలెవల్ బ్రిడ్జును నిర్మాణం పనులకు 2023 సంవత్సరం జూన్‌లో అప్పటి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ అంజయ్య యాదవ్ భూమి పూజ చేయడంతో ఉన్న పాత బ్రిడ్జిని కూల్చి వేసి నిర్మాణ పనులకు పునాదులు వేశారు. ప్రభుత్వం మారినా నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రాకపోకలు బంద్ అవుతున్నాయని వారు అంటున్నారు.

వర్షాకాలంలో ఈ వాగు నుండి రాకపోకలు సాగించాలంటేనే భయంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్జి నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందించడం లేదని అంటున్నారు. తాత్కాలిక సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి మటి పోసి చేతులు దులుపుకుంటున్నరే తప్ప శాశ్వతంగా నిర్మాణ పనులు చేపట్టడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News