Friday, September 22, 2023

దశాబ్ది ఉత్సవాలు భావితరాలు గుర్తించుకునేలా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ రాజర్షి షా

మెదక్ : జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను భావితరాలు గుర్తించుకునేలా పండుగ వాతావరణంలో బ్రహ్మాండంగా నిర్వహించుటలో ప్రజాప్రతినిధులతో పాటు గ్రామ, మండల, జిల్లా స్థాయి అధికారులు భాగస్వాములై అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా అధికారులతో కలిసి తహశీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, వ్యవసాయాధికారులు, ఏ ఈలు, డిఈలు, ఎపిఎంలు, అంగన్‌వాడీ సూపర్వైజర్లు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్లు, పిహెచ్‌సి వైద్యాధికారులు, మునిసిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు తదితర మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జూన్ 2 నుంచి 22 వ రకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుటకు షె డ్యూల్ ప్రకటించిందని, ఈ మేరకు జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి కృషితో విజయవంతం చే యుటకు జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశమవ్వగా నేడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చే శారన్నారు. స్థానిక శాసనసభ్యుల ఆధ్వర్యంలో కార్యక్ర మ కార్యాచరణ రూపొందించుకొని ప్రజాప్రతినిధుల భా గస్వామ్యంతో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిచాలన్నారు. జూన్ 3న రైతు దినోత్సవాన్ని జిల్లాలోని 76 రైతు వేదికల్లో వేయి మందితో ఘనంగా జరపాలని, వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవం తెలపాలని, సహపంక్తి భోజనం చేయాలన్నారు.

తగు ఏర్పాట్లకై వెంటనే మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని వేదిక, రైతుల మొబిలైజేషన్, భోజనాల ఏర్పాట్లపై కార్యాచరణలోకి దిగాలన్నారు. 4న జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో సాయంత్రం ర్యాలీ,సభ అనంతరం వేయి మందితో బడా ఖానా ఉంటుందన్నారు. 5న విద్యుత్ విజయోత్సవంలో భాగంగా ప్రతి సబ్ స్టేషన్‌ను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, నియోజక వర్గ స్థాయిలో వేయి మందితో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును తెలపాలన్నారు. 6న ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో సభలు నిర్వహించాలన్నారు. 7న సాగునీటి దినోత్సవంలో నియోజక వర్గ స్థాయిలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతినితెలపాలన్నారు. 8న జిల్లాలోని 469 గ్రామ పంచాయతీలలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం ఊరూరా చెరువుల పం డుగ నిర్వహించాలన్నారు.

డప్పులు, బోనాలు,బతుకమ్మ లు, మత్స్యకారుల వలలతో ఊరేగింపుగా బయలు డేరాల ని, పండుగ వాతావరణం ప్రతిబింబించేలా ము గ్గులు,తోరణాలతో అలంకరించాలని, చెరువు కట్టపై సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 9న వేయి మందితో నియోజక వర్గ స్థాయిలో సంక్షేమ సంబురాలు నిర్వహించాలని ఇందులో ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, వృత్తి పనుల వారికీ ఆర్థ్ధిక సహాయం, గొర్రెల పంపిణీ ఉంటుందన్నారు.10 న జిల్లా స్థాయిలో సుపరిపాలన దినోత్సవం, 11 న జిల్లా స్థాయి లో కవి సమ్మేళనం ఉంటుందన్నారు. 12 న నియోజక వార స్థాయిలో తెలంగాణా రన్, 13న నియోజక వర్గ స్థా యిలో మహిళా సంక్షేమ దినోత్సవం ఉంటుందన్నారు.

14న నియోజక వర్గ స్థాయిలో నిర్వహించే వైద్యారోగ్య ది నోత్సవంలో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందించడం జరుగుతుందన్నారు. 15న పల్లె ప్రగతి,16న పట్టణ ప్రగతిలో సిపాయి అన్న-సలాం అన్న, సఫాయి ఆమె-సలాం అమ్మ పేర సిపాయి కార్మికులను సన్మానించాలన్నారు. 58,59 జిఓ కింద అర్హులకు పట్టాలందించాలన్నారు. 17న గిరిజ న గ్రామాల్లో సభలు నిర్వహించాలన్నారు. 18న మంచినీళ్ల పండుగనాడు ఫిల్టర్ బెడ్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల సందర్శన ద్వారా నీళ్లను శుభ్రపరుస్తున్న తీరును వివరించాలన్నారు. 19న పెద్దఎత్తున పల్లెలు, పట్టణాలలో మొక్కలు నాటాలని ఇందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు 20న విద్యా దినోత్సవం నాడు అన్ని పాఠశాలలో పతాక వందనం చేయాలని, మన ఊరు మన బడి కింద పూర్తైన పాఠశాల ప్రారంభం, దుస్తులు, పుస్తకాల పంపిణీ చేపట్టాలన్నారు. 21న దేవాలయాలు, మసీదులు, చర్చిలను అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 22న అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, అమరుల సంస్మరణ తీర్మానం చేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో షెడ్యూల్ ప్ర కారం చక్కటి కార్యాచరణతో ఏర్పాట్లు చేసి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయుటకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News