Tuesday, April 30, 2024

చీపురు ధాటికి కాంగ్రెస్, కమలం కకావికలు

- Advertisement -
- Advertisement -

congress

 

ఢిల్లీ ఎన్నికల్లో అసలు నష్టం హస్తం పార్టీకే !
స్వయంకృతాపరాధాలూ ఉన్నాయి
కొన్నేళ్లుగా పతనంవైపు పార్టీ ప్రయాణం
తగ్గుతూ వస్తున్న కాంగ్రెస్ ఓటింగ్ శాతం

న్యూఢిల్లీ: ఎన్నికలంటే గెలుపు ఓటముల సయ్యాట. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు సమయంలో కొన్ని రౌండ్లు పూర్తయ్యాక ఎవరు గెలుస్తారో తెలిసిపోతుంది. తదనుగుణంగా అభ్యర్థులూ స్టేట్‌మెంట్‌లు ఇస్తుంటారు. కానీ, మొదటి రౌండు లెక్కింపు ముందే తన ఫ్యూచర్ ఏమిటో తెలుసుకొని, ఓటమిని అంగీకరించే అభ్యర్థులూ ఉంటారు. ఇలాంటి సీన్లను మనం ఎన్నిసార్లు చూసుం టాం? ఇదివరకటి సీన్లను పక్కనపెడితే తాజాగా ఢిల్లీ ఎ న్నికల ఓట్ల లెక్కింపులో అలాంటి సన్నివేశం ఎదురైంది.

ఓడిపోతానని ముందే చెప్పిన ముకేష్
ఢిల్లీ వికాస్‌పురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముకేష్ శర్మ తన ఓటమిని ముందే అంగీకరించారు. మంగళవారం ఉదయం 8.46 గంటలకు ఆయన ఓటమిని ఒప్పుకుంటూ, మద్దతిచ్చిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 1993 అసెంబ్లీలో తనే అతి పిన్నవయస్కుడని కూడా పేర్కొన్నారు. 1993 2018 మధ్యకాలంలో ఢిల్లీ నేలిన భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిగా సాగిలపడిందనడానికి ఇదొక నిదర్శనం.

సమస్య ఎక్కడ మొదలైందంటే
లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోడీ బిజెపి ఢిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ కైవసం చేసుకున్నప్పుడు ఆప్‌కు కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లే వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆప్‌కు 18.1 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 22.5 శాతం, బిజెపికి 56.6 శాతం ఓట్లు వచ్చాయి. దేశ రాజధానిపై తనకు పట్టు తగ్గుతోందని గ్రహించిన కాంగ్రెస్ 2019 జనవరిలో ఢిల్లీ శాఖ పార్టీ అధ్యక్షపదవిని షీలా దీక్షిత్‌కు కట్టబెట్టింది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ జనరల్ సెక్రెటరీ, ఢిల్లీ పార్టీ ఇన్‌ఛార్జి షీలాదీక్షిత్ అధికారాల్ని తగ్గించి, ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టినప్పటి నుంచీ కష్టాలు మొదలయ్యాయి.

ఆప్ రాకతో దళిత ఓట్లకు గండి
2013 ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ పార్టీకి అంతవరకూ సంప్రదాయికంగా ఉన్న దళిత, పట్టణ పేదల ఓటు బ్యాంక్‌కు గండిపడింది. 2008 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు సాధించిన ఈ సుదీర్ఘ చరిత్ర ఉన్న జాతీయ పార్టీకి 2013లో కేవలం 24.55 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. బిజెపికి 33శాతం ఓట్లు దక్కితే ఆప్ 29 శాతం తెచ్చుకుంది. నిజానికి 2019 ఎన్నికల్నే చెప్పుకోనక్కర్లేదు… 2013 నుంచి కాంగ్రస్ పతనం వైపు పయనం ప్రారంభించింది. కాంగ్రెస్ ఢిల్లీ శాఖాధ్యక్షురాలిగా పనిచేసిన శర్మిష్టా ముఖర్జీ పార్టీ నాయకుల్ని తీవ్రంగా దుయ్యబట్టారు.

పార్టీకోసం పనిచేయకుండా తమ ప్రత్యర్థుల్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ఓటమికి కారణాల్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘పార్టీ ఉన్నతస్థాయిలో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో వ్యూహం, ఐక్యత లేవు. అవి కార్యకర్తల్ని నిరుత్సాహ పరుస్తున్నాయి. అట్టడుగు స్థాయిలో సంబంధాలు లేవు’ తీవ్రస్థాయిలో ఆమె విరుచుకుపడ్డారు. అంతేకాదు…ప్రస్తుత పరిస్థితిని చూస్తే అసలు నష్టం బిజెపికి కాదని, కాంగ్రెస్‌కే ననీ అర్థమవుతుంది.

ఓట్ల వాటాలో ‘ఆప్’ ఫస్ట్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్’ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తను సాధించిన ఓట్ల శాతాన్ని దాదాపు నిలబెట్టుకుంది. 38.5 ఓట్లతో బిజెపి రెండోస్థానం సాధించింది. ఎటొచ్చీ కాంగ్రెస్ పార్టీకే ఎన్నడూ చవిచూడని చేదు అనుభవం ఎదురైంది. ఆ పార్టీకి కేవలం నాలుగు శాతం ఓట్లే వచ్చాయి. ఎన్నికల సంఘం (ఇసి) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ 53.6 శాతం ఓట్ల వాటా సాధించింది. 2015 లో ఆ పార్టీకి 54.34 శాతం ఓట్ల వాటా లభించింది. కాగా, బిజెపి ఢిల్లీ అసెంబ్లీలో తన స్థానాల సంఖ్యను కాస్త మెరుగుపరుచుకుంది.

Declining congressional voting percentage
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News