Wednesday, May 1, 2024

ఒకప్పుడు ప్రేమ అనేది నాన్‌సెన్స్ అనుకున్నా

- Advertisement -
- Advertisement -

Vijay Deverakonda

 

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఎమోషన్, రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీ ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో కె.ఎ.వల్లభ నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరో విజయ్ దేవరకొండతో ఇంటర్వూ విశేషాలు…

ఆ చిత్రంతో పోలిక ఉండదు…
ఈ చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి’ లాంటి హిట్ మూవీతో పోల్చడం మంచిదే. కానీ ‘అర్జున్ రెడ్డి ’తో ఈ చిత్రానికి పోలిక ఉండదు. నేను ఇప్పుడు గడ్డంలో యాక్షన్ మూవీ చేసినా, ఫిక్షన్ మూవీ చేసినా ఆ మూవీతో పోల్చుతారు. ఈ చిత్రంలో మూడు లవ్ స్టోరీస్ ఉంటాయి. వాటిలో ఒక లవ్ ట్రాక్ మాత్రం అర్జున్ రెడ్డి పాత్రను కొంచెం పోలి ఉంటుంది.

మూడు కథలకు సంబంధం…
ఈ సినిమాలోని మూడు ప్రేమ కథలకు మధ్య సంబంధం ఉంటుంది. ఆ సంబంధం ఏమిటనేది ప్రేక్షకులు తెరపై చూసి తెలుసుకోవాలి.

పూర్తి సహకారం అందించారు…
దర్శకుడు క్రాంతిమాధవ్ రైటింగ్ స్కిల్స్ అమోఘం. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి కారణం ఆయనే. అలాగే నిర్మాత కె.ఎస్. రామారావు పూర్తి సహకారం అందించారు.

చాలా కష్టపడాల్సి వచ్చింది…
నా కెరీర్ లో హార్డెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ చిత్రం చేస్తున్నప్పుడు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా ఒత్తిడికి గురయ్యాను. వివిధ గెటప్స్, పాత్రలలో వేరియేషన్స్ కొరకు చాలా కష్టపడాల్సివచ్చింది.

జీవితంలో ప్రేమ ఉండాలి…
ఒకప్పుడు నేను ప్రేమ అనేది నాన్‌సెన్స్ అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రేమపై నాకు నమ్మకం కుదిరింది. జీవితంలో ప్రేమ అనేది ఉండాలి.

పెళ్లి అనేది పెద్ద బాధ్యత…
నేను పెళ్లి చేసుకుంటా… కానీ ఇప్పుడే కాదు. నేను ఇంకా పెళ్లికి సిద్ధం కాలేదు. ఇంకా పిల్లాడినే అనుకుంటున్నా. పెళ్లి అనేది చాలా పెద్ద బాధ్యత. అందుకే కొంత కాలం తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తా.

ఆ తరహా సినిమాలు చేయను…
ఈ సినిమా తర్వాత నేను లవ్ స్టోరీస్ చేయనంటే అర్థం… కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తానని కాదు. అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ తరహా సినిమాలు చేయనని అంటున్నాను. అయితే పూరి సినిమాలో కొంచెం లవ్ ఉండే అవకాశం ఉంది.

నాలాగే ఉండటానికి ఇష్టపడతా…
నేను నాలాగే ఉండటానికి ఇష్టపడతాను. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని యూత్‌ని మనం ఆపేస్తున్నాం. అయితే చేసే పనికి వచ్చే ఫలితం ఏదైనా నేను స్వీకరిస్తాను.

Interview with Hero Vijay Deverakonda
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News