Saturday, December 2, 2023

పెట్టబడులు ఢమాల్!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ప్రై వేట్ పెట్టుబడులు భారీగా తగ్గిపోవడం ఆం దోళన కలిగిస్తోంది. సహజంగా ప్రైవేట్ పెట్టు బడులు అంతర్జాతీయ పరిణామాలు మీద ఆ ధారపడి ఉంటాయని, కానీ ఆ ఒక్క కారణ మే కాకుండా దేశంలో వస్తువులు, సేవల డిమాండ్ రికార్డుస్థాయిలో తగ్గిపోవడం తో ప్రజల కొనుగోలు శక్తి కూడా పడిపో యిందని, ఇదే ప్రస్తుతం ప్రైవేట్ పెట్టుబడు లు భారీగా తగ్గిపోవడానికి ప్రధాన కారణం గా నిలిచిందని ప్రపంచబ్యాంకు నివేదికలు పేర్కొన్న అంశాలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారాయి. దేశంలో ప్రైవేట్ పెట్టు బడులు గణనీయంగా తగ్గిపోవడానికి గల కారణాలపై ప్రపంచబ్యాంకు నిర్వహించిన అధ్యయనంలో అనేక చేదు నిజాలు బయట పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మం త్రిత్వశాఖతో పాటుగా తెలంగాణ వంటి ప్ర గతిశీల రాష్ట్రాలు కూడా ఈ పరిణామాలపై దృష్టిసారించాయి.

2014వ సంవత్సరంలో దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు జిడిపిలో 26 శాతం ఉన్నాయని, అది కాస్తా 2022వ సంవత్సరానికి వచ్చేసరికి ప్రైవేట్ పెట్టుబడులు 22 శాతానికి పడిపోయాయని, ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింతగా క్షీణించే ప్రమాదం ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖలోని కొందరు సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, జిఎస్‌టి వంటి ఏడు రకాల పన్నుల విధానం, రికార్డుస్థాయిలో పెరిగిన ధరల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించిపోవడం వంటి అననుకూల పరిణామాలను పరిశీలిస్తున్న ప్రైవేట్ పెట్టుబడిదారులు దేశంలో పెట్టుబడులు పెట్టకుండా తమకు అనుకూలంగా ఉన్న దేశాలకు తమతమ పెట్టుబడులు మళ్లిస్తున్నారని ఆ సీనియర్ అధికారులు వివరించారు.

అంతేగాక ఇండియా వంటి ధరలు ఎక్కువగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టేకంటే చైనా వంటి దేశాల నుంచి తమకు అవసరమైన వస్తువులు, పరికరాలను దిగుమతి చేసుకోవడమే కారుచౌకగా ఉన్నాయని కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులు భావిస్తున్నారని ప్రపంచబ్యాంకు నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమయ్యిందని వివరించారు.భారత దేశంలో సింహ భాగంగా ఉన్నటువంటి మధ్యతరగతి, గ్రామీణ ప్రజానీకం ఆదాయాలు భారీగా పడిపోవడంతో వస్తువులు, సేవల వినియోగం తగ్గించుకొంటున్నారని, అందుకే ప్రైవేట్ పెట్టుబడిదారులు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపడంలేదని స్పష్టమయ్యిందని వివరించారు. 2014 నుంచి 2022 వరకు గడచిన ఎనిమిదేళ్లల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సాధించిన ఘనత ఇదేనని ఆర్ధికవేత్తలు, అధికారవర్గాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులు చైనాలో తయారీరంగం రికార్డు స్థాయిలో పుంజుకోవడానికి ప్రధాన కారణమయ్యిందని, “తయారీ రంగంలో చైనా మోనోపలి” (ఏకఛత్రాధిపత్యం) కొనసాగడానికి మనదేశంలోని ఆర్థిక విధానాలు, పన్నులు, ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలే ప్రధాన కారణాలని వివరించారు. ప్రైవేట్ పెట్టుబడులు రానున్న రోజుల్లో మరింతగా క్షీణించే ప్రమాదం కూడా ఉందని ఆందోళనం వ్యక్తంచేస్తున్నారు.ఏ దేశంలోనైనా ఒక ఏడాది నుంచి మరో ఏడాదికి పెట్టుబడులు పెరుగుతూనే ఉంటాయని, కానీ దేశాన్ని పాలిస్తున్న బిజెపి హయాంలో కాలంగడుస్తున్న కొద్దీ దేశంలో ఉన్న పరిశ్రమలు మూతబడటం, ప్రైవేట్ పెట్టుబడిదారులు దేశం వదిలి పారిపోవడం, చివరకు దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకొని ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకొంటున్నారంటేనే మన దేశంలో అమలవుతున్న ఆర్థిక విధానాలు,

పన్నులు, ధరలు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్ధంచేసుకోవాలని ఆ సీనియర్ అధికారులు కోరుతున్నారు. దేశంలో ఒక పరిశ్రమను నెలకొల్పాలంటే స్వల్పకాలంలోనే ఏడు రకాల పన్నులు చెల్లించాల్సి రావడం, ఆ పన్నులన్నీ కలిపి పెట్టుబడిలో ఏకంగా 45 శాతం వరకూ ఉంటున్నాయని, దీనికితోడు క్లియరెన్స్‌ల కోసం అవినీతికి కూడా కొంత బడ్జెట్‌ను కేటాయించుకొని ప్రైవేట్ పెట్టుబడిదారులు ప్రాజెక్టు రికోర్టులు తయారు చేసుకోవాల్సి వస్తోందని, దాంతో మొత్తం పెట్టుబడిలో 50 శాతం వరకూ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని వివరించారు.ఒక ప్రాజెక్టును నెలకొల్పడానికి వంద కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసుకుంటే పన్నులు, లంచాలకు కలిపి మరో 50 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని, అంటే వంద కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ప్రాజెక్టుకు ఇండియాలో 150 కోట్లను ఖర్చు చేయాల్సి వస్తోందని,

అదే ఇతర దేశాల్లోనైతే ఈ అదనపు ఖర్చులుండవని, అందుకే ప్రైవేట్ పెట్టుబడిదారులు దేశంలో ఎక్కడా పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని చూపడంలేదని వివరించారు. ఒకవేళ ఎన్నో రిస్కులు తీసుకొని ఏదైనా పరిశ్రమను నెలకొల్పడానికి పెట్టుబడిపెట్టినా తమ కంపెనీల ఉత్పత్తులు అమ్ముడవుతాయనే గ్యారెంటీలేదని, దేశ ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితులు లేవని, ఇతర దేశాలకు ఎగుమతులు చేద్దామంటే కేంద్ర ప్రభుత్వ ఎగుమతుల విధానాలు కూడా తమకు అనుకూలంగా లేవని, ఈ మొత్తం కారణాల రీత్యా దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు రికార్డుస్థాయిలో తగ్గిపోతున్నాయని వివరించారు.అందుకే ప్రపంచ బ్యాంకు నివేదిక దేశంలో హాట్ టాపిక్‌గా మారిందని ఆ అధికారులు అంటున్నారు. కాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలవుతాయని,

సరుకుల ధరలు పెరిగితే మధ్యతరగతి, సామాన్య ప్రజలు, గ్రామీణ ప్రజల వస్తు వినియోగం, సేవల వినియోగాలు తగ్గిపోతాయనే మౌలిక విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉందని, ఈ కారణాలన్నీ ఇతర రంగాలపైన కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతాయనే విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడ బాధాకరమని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, జిఎస్‌టి వంటి ఏడు రకాల పన్నులు, ధరలు సామాన్యులు, గ్రామీణ ప్రజలు తట్టుకునే స్థాయిలోకి తగ్గితేనే మళ్లీ ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతాయని,లేకుంటే రానున్న రోజుల్లో ఎదురయ్యే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక ప్రైవేట్ రంగంలోని పరిశ్రమలు వేల సంఖ్యలో మూతబడే ప్రమాదాలు పొంచి ఉన్నాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం దేశ ప్రజల నడ్డి విరుస్తున్న ఆర్థిక విధానాలు,

పన్నులు, ధరలను పూర్తిగా తగ్గించాలని, లేకుంటే ఈ సంక్షోభం మరింత తీవ్రరూపం దాలుస్తుందని వివరించారు. కానీ ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే చైనా దేశం మరింతగా ఆర్థికంగా బలపడుతుందని, తయారీ రంగంలో ఇండియాలోని ప్రైవేట్ పెట్టుబడిదారులు పూర్తిగా చైనా నుంచి దిగుమతి చేసుకోవడానికే మొగ్గుచూపుతారని, దేశంలో తయారీ రంగం కూడా కుంటుపడుతుందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ బ్యాంకు నివేదికలనైనా పరిగణనలోకి తీసుకొని కేంద్రం తన విధానాలను మార్చుకుంటుందో.., లేదో… వేచిచూడాలని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News