Saturday, April 27, 2024

EVMs:ఇవిఎంలపై అనుమానాలు.. రిమోట్ ఓటింగ్‌పై ప్రతిపక్ష నేతల ఆందోళన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సీనియర్ రాజకీయ నేత, ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ నివాసంలో గురువారం ప్రతిపక్ష నేతల కీలక సమావేశం జరిగింది. ఎన్నికల నిర్వహణను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) ద్వారా నిర్వహించడంపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని, వీటిపై ఎన్నికల సంఘానికి విపక్షాలు ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వలసదార్లు అయిన ఓటర్లకు వారుండే ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వీలు కల్పించడంపై కూడా ప్రతిపక్షాల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశానికి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, భారాస తరఫున కె కేశవరావు, రాజ్యసభలో ఇండిపెండెంట్ సభ్యులు కపిల్ సిబల్, ఎస్‌పి నేత రామ్‌గోపాల్ యాదవ్ ఇతరులు హాజరయ్యారు. టిఎంసి నుంచి ఈ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలే కీలకం అయినప్పుడు ఈ వ్యవస్థలో కొన్ని విషయాలపై తమ అనుమానాలను ఇప్పుడు తాము ఎన్నికల సంఘానికి నివేదించడం జరుగుతుందని, వీటి నుంచి ఎన్నికల సంఘం స్పందనను తాము ఆశిస్తున్నట్లు సమావేశం తరువాత పవార్ విలేకరులకు తెలిపారు. ఇది వారికి కేవలం తమ ఆందోళనను వ్యక్తం చేయడమే అన్నారు. ఇవిఎంలపై తమకు సందేహాలేమి లేవని, అయితే ముందుగా ఇవిఎంలను కేవలం ప్రత్యామ్నాయ యంత్రాలుగా పేర్కొన్నారని, ఇప్పుడు పూర్తి స్థాయిలో బ్యాలెట్ పెట్టెలు పోయి వీటినే వాడుతున్నారని, ఇప్పుడు చివరికి అభ్యర్థుల పేర్లను కూడా ఇంటర్నెట్ ద్వారా చేర్చవచ్చునని, రిమోట్ ఓటింగ్‌కు వీలు కల్పిస్తున్నామని అంటున్నారని మధ్యప్రదేశ్ మాజీ సిఎం దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

ఇతర ఏ దేశంలో కూడా ఇవిఎంలు వాడటం లేదు, పైగా ఎన్నికల ఫలితాలు తరచూ ఒకేవైపు కనబడుతున్నాయని, ఇక అనుమానాలకు తావు ఎందుకు ఉండకూడదని కపిల్ సిబల్ చెప్పారు. ఇతర దేశాలలో లేనప్పుడు ఇక్కడ ఈ పద్థతిలో ఓటింగ్ ఎందుకు? అని ప్రశ్నించారు. తాము లేవనెత్తే సందేహాలపై ఇసి నుంచి సరైన సమాధానం రాకపోతే తాము రాజకీయ చర్యకు దిగాల్సి ఉంటుందని సిబల్ తెలిపారు. దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ ఎన్నికల అంశంపై ఏర్పాటు అయిన సిటిజన్ కమిషన్ ఇప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ మదన్ లోకుర్ సారథ్యం వహిస్తున్నారని, ఈ కమిషన్ ఇవిఎంలపై అనుమానాల గురించి ఎన్నికల సంఘానికి పలుసార్లు తెలిపిందని అయితే ఇంతవరకూ అటువైపు నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో తమకు మరిన్ని అనుమానాలు తలెత్తాయని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News