Sunday, December 3, 2023

రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా..

- Advertisement -
- Advertisement -

నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న దీక్షిత్ శెట్టి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఇందులో నా పాత్ర పేరు సూరి.

హీరో క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్. సినిమా అంతా వుంటుంది. చాలా కీలకమైన పాత్ర. రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా దసరా. మంచి కంటెంట్‌తో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ చేసిన అద్భుతమైన ఎంటర్‌టైనర్ ఇది. ‘దసరా’ సినిమా చేయడంతో తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, నడవడిక … ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా కోసం నానితో దాదాపు పది నెలల పాటు ప్రయాణించాను. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని నేచురల్ స్టార్. చాలా సహజంగా నటిస్తారు. కీర్తి సురేష్‌తో కలసి పని చేయడం మంచి అనుభవం. దర్శకుడు శ్రీకాంత్ ఒదెల మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తను అనుకున్నది వచ్చే వరకూ ఎక్కడా రాజీ పడరు. చాలా క్లారిటీ విజన్ వున్న దర్శకుడు. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News