Wednesday, May 29, 2024

గ్లోబల్ స్టార్‌తో మెగా పవర్ స్టార్..

- Advertisement -
- Advertisement -

ఆస్కార్ అవార్డ్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ప్రత్యేకంగా పలు ఈవెంట్స్‌లోనూ పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా లాస్‌ఏంజిల్స్‌లోని పారమౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక్ చోప్రా హోస్ట్ చేసిన ప్రత్యేకమైన కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పాల్గొన్నారు. దక్షిణాసియాకి చెందిన చిత్రాలు ఆస్కార్ కి నామినేట్ అయిన సందర్భంగా ఈ పార్టీ ఇచ్చింది పారామౌంట్ సంస్థ.

ఈ కార్యక్రమంలో దక్షిణాసియాకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు, ఆస్కార్ నామినీస్, ఇతర సెలెబ్రిటీలు పాల్గొన్నారు. రామ్‌చరణ్‌తో పాటు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల కూడా ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంకకు ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. తన భర్త రామ్ చరణ్, ప్రియాంక చోప్రా కలిసి ఉన్న ఫొటోలను ఆమె షేర్ చేశారు. అంజుల ఆచార్య్, మిండి కలింగ్, కుమైల్ నంజైని, కల్ పెన్, అజీజ్ అన్సారీ, బెలా బజ్రియా, రాధికా జోన్స్, జోసెఫ్ పటేల్, శ్రుతీ గంగూలీ, అనితా ఛటర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News