ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి 2898 ఎడి సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అద్భుతమైన విజువల్స్, మైథాలజి కాన్సెప్ట్, స్టార్ నటుల కలయికతో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తూ మేకర్స్ ప్రీ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్కి 2898 ఎడిలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇకపై సీక్వెల్‌లో భాగం కాబోదని వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఈ మేరకు వైజయంతి మూవీస్ సోషల్ మీడియా ద్వారా ఒక నోట్ విడుదల చేసింది. “సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత కూడా మేము దీపికాతో భవిష్యత్ ప్రాజెక్ట్‌లో కొనసాగలేకపోతున్నాం. కల్కి 2898ఎడి లాంటి సినిమాకు చాలా పెద్ద కమిట్‌మెంట్ అవసరం ఉన్నది. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం” అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటాని లాంటి భారీ కాస్ట్‌తో మొదటి భాగం రూపొందింది. అయితే దీపికా లాంటి నేషనల్ స్టార్ ఇక సీక్వెల్‌లో లేరని చెప్పడం అభిమానులకు ఒక పెద్ద షాక్‌గా మారింది. ఇక మేకర్స్ దీపికా స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Also Read: ఉత్తరాఖండ్ లో వరద బీభత్సం..పలు గ్రామాలు జలమయం