Friday, May 2, 2025

బిసిసిఐకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ)కి తాజాగా ఊహించని షాక్ తగిలింది. బోర్డు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు సరికొత్త వివాదానికి తెరలేపింది. బిసిసిఐ ఐపిఎల్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రమోగాలు చేస్తుటుంది. తొలుత అంపైర్ క్యామ్, ఆ తర్వాత స్పైడర్ క్యామ్.. ఈ ఏడాది రోబో కుక్కను ప్రవేశపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రోబో కుక్కను ప్రవేశపెట్టారు. అయితే ఈ కుక్కకు నామకరణం చేసే పనిని ఓటింగ్ పద్దతిలో చేయాలని ప్రేక్షకులను కోరారు.

అయితే చాలా మంది ఆ కుక్కకు చంపక్ అనే పేరుకు ఓటు వేయగా… ఏప్రిల్ 20వ తేదీన ఆ పేరునే నామకరణం చేశారు. ఇప్పుడు ఇదే వ్యవహారంతో బిసిసిఐ చిక్కుల్లో పడింది. ఢిల్లీ ప్రెస్‌ పత్రా ప్రకాశన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1968 నుంచి తమ సంస్థ చంపక్ అనే పేరుతో పిల్లల కోసం మ్యాగజీన్‌ ప్రచురిస్తున్నామని తమ అనుమతి లేకుండా తమ ట్రేడ్ మార్క్ పేరును వాడుకున్నారని కోర్టుకు తెలిపింది.

దీంతో ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి.. బిసిసిఐకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా సమాధానంతో తమ ముందుకు రావాలని బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News