Thursday, May 2, 2024

ఆప్‌కు షాక్…మంత్రి ఆర్‌కె ఆనంద్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం మంత్రివర్గం నుంచి వైదొలగడంతోపాటు ఆప్ కు రాజీనామా చేశారు. పార్టీలో దళితులకు ప్రాతినిధ్యం కల్పించలేదని ఆయన ఆరోపించారు. సాంఘిక సంక్షేమ శాఖతో సహా వివిధ శాఖలను నిర్వహిస్తున్న ఆనంద్ ఢిల్లీలో విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్ర నేతలలో దళితులు ఎవ్వరూ లేరని ఆరోపించారు. ‘పార్టీ దళిత ఎంఎల్‌ఎలు, కౌన్సిలర్లు, మంత్రులను గౌరవించదు. ఇటువంటి పరిస్థితుల్లో తాము వంచనకు గురైనట్లు దళితులు అందరూ భావిస్తున్నారు. మనం సమ్మిళిత సమాజంలో నివసిస్తున్నాం. అయితే, దామాషా గురించి మాట్లాడడం తప్పు కాదు. ఈ పరిస్థితుల మధయ పార్టీలో కొనసాగడం నాకు కష్టం. అందుకే పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని ఆనంద్ తెలిపారు.

ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌పై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘రాజకీయాలు మారితే దేశం కూడా మారుతుందని అర్వింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ నుంచి చెప్పారు. రాజకీయాలు మారలేదు కానీ రాజకీయ నేత మారారు’ అని పటేల్ నగర్ నియోజకవర్గం ఎంఎల్‌ఎ అయిన ఆనంద్ అన్నారు. రాజీనామా సమయం గురించిన ప్రశ్నకు ఆనంద్ సమాధానం ఇస్తూ, ‘సమయం గురించి కాదు. మమ్మల్ని ఇరికిస్తున్నారనే భావనలో మేము మంగళవారం వరకు ఉన్నాం. కానీ హైకోర్టు తీర్పు అనంతరం మా వైపు నుంచే ఏదో తప్పు ఉందని అనిపించింది’ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News