Saturday, July 27, 2024

వర్షాలతో విష జ్వరాల కాటు

- Advertisement -
- Advertisement -

Dengue And malaria cases Rise in Hyderabad

హైదరాబాద్: నగరంలో కురుసున్న వర్షాలకు విషజ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. గత ఆరునెల నుంచి కరోనా మహమ్మారితో బాధపడుతున్న ప్రజలు సీజనల్ వ్యాధులు రావడంతో అవస్దలు పడుతున్నారు. వానలు కురుస్తుండటంతో రోడ్లపై మురునీరు, చెత్త చేరడంతో దోమలు విజృంభించి ప్రజలను ఆసుపత్రుల బాట పట్టిన్నాయి. స్దానిక మున్సిఫల్ అధికారుల ఫాగింగ్ చేయకపోవడంతో రోడ్లపై నీరు నిల్వడంతో కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయని స్దానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి డెంగ్యూ, మలేరియా, విరేచనాలకు సంబంధించిన రోగులు ఫీవర్ ఆసుపత్రి చికిత్స కోసం వెళ్లుతున్నారు. అక్కడి వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముందుగా టెస్టులు చేసుకుని రిపోర్టు తీసుకొస్తే సీజనల్ వ్యాధులకు వైద్యం చేస్తామని సూచించడంతో రోగులు ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకుంటున్నారు. దఖానకు రోజుకు 280మందికి పైగా రోగులు వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు 148 డెంగ్యూ, 93 మలేరియా కేసులు నమోదైనట్లు వెల్లడిస్తున్నారు. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో విషజ్వరాల బారినపడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. గత ఏడాది రాజధాని నగరంలో 2710 డెంగ్యూ, 300 మలేరియా కేసులు నమోదయ్యాయి. నగరంలో 168బస్తీ దవాఖానలు, 56 పట్టణ అర్బన్ కేంద్రాలు ఉన్న వాటిలో రోజుకు సుమారుగా 45నుంచి 80మందికి వైద్యం అందిస్తున్నారు.అక్కడ రోగుల సంఖ్య పెరగడంతో ఫీవర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వందలాదిమంది రోగులతో ఆసుపత్రి సందడిగా మారింది. ప్రభుత్వం తాత్కాలికంగా వైద్య సిబ్బందిని నియమించి రోగులకు సకాలంలో చికిత్సలు అందించేలా చూడాలని వైద్యులు కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల వస్తే సాధారణ జ్వరం, మూడు రోజ్లులో తగ్గుతుంది, ముక్కునుంచి నీరు కారుట, కఫంతో కూడిన దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. గొంతునొప్పి ,కండ్లు ఎర్రబడుట,వాంతులు విరేచనాలు ఉంటాయని వివరిస్తున్నారు.

చుట్ట పక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: వైద్యులు

నగరంలో కురుస్తున్న వానలకు బస్తీ,కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పాటు, చెత్త ఉండటంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలను కంటిమీద కునుకు లేకుండా కాటు వేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఫాగింగ్ చేయడంతో పాటు, చెత్తను ఎప్పటికప్పడు తొలగిస్తే ప్రజలకు సోకకుండా కాపాడవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

Dengue And malaria cases Rise in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News