Thursday, May 2, 2024

బల్దియా సమరానికి గులాబీ నేతల దూకుడు

- Advertisement -
- Advertisement -

Greater Hyderabad Municipal Elections 2020

హైదరాబాద్: బల్దియా ఎన్నికల సమరం డిసెంబర్ నిర్వహిస్తారనే ప్రచారంతో అధికార టిఆర్‌ఎస్ నాయకులు పోరులో మరోసారి సత్తా చాటేందుకు దూకుడు పెంచారు. ఈసారి సెంచరీ దాటేందుకు పార్టీ పెద్దలు వ్యుహాలు రచించే పనిలో పడ్డారు. 150 డివిజన్లకు గతంలో 99 డివిజన్ గులాబీ పార్టీ తమ ఖాతాలో వేసుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. గత ఐదేళ్లలో నగరాభివృద్దికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి మహానగరానికి కొత్త రూపురేఖలు తీసుకొచ్చారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అభివృద్ది నినాదంతో ముందుకు వెళ్లి మూడుంకెల సీట్లను కైవసం చేసుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ పెద్దలు స్దానిక నాయకులకు సూచించారు.

పార్టీ సీటు ఎవరికి ఇచ్చిన అందరూ ఐకమత్యంగా పనిచేసి గెలుపించాలని పేర్కొంటున్నారు. గులాబీ పార్టీ శ్రేణలు దూకుడుకు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నాయి. ఆయా పార్టీ సీనియర్ల వ్యవహార శైలితో కార్యకర్తలు బేజారైపోతున్నారు. ఏ ఒక నిర్ణయం సక్రమంగా తీసుకోవడంలేదని, అన్ని వర్గాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని మండిపడుతూ గులాబీ నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్దమైతున్నారు. టిఆర్‌ఎస్ చేపట్టిన పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని, ఫించన్లు,డబుల్ బెడ్‌రూం, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పేదలకు కార్పొరేట్ విద్య అందిస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

గులాబీ కండువాలు మేడలో ధరించేందుకు విపక్ష పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు తమకు పరిచయమున్న గులాబీ నేతలను కలిసే పనిలో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన నాయకులు తమను కలిసి టిఆర్‌ఎస్‌లో పనిచేస్తామని ముందుకొస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.రెండోసారి గ్రేటర్‌లో విజయపతాకం ఎగురవేసి, రానున్న ఐదేళ్లలో దేశంలోని గ్రేటర్ నగరాల్లో హైదరాబాద్‌ను ప్రథమ స్దానంలో నిలుపుతామని చెబుతున్నారు. ప్రజలు తాము చేసిన అభివృద్ది చూసి అధికారం కట్టబెట్టాలని కోరుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News