Saturday, October 5, 2024

మహబూబ్‌నగర్‌లో బహిర్భూమికి వెళ్లిన బాలికపై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: బహిర్భూమికి వెళ్లిన బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలిక తండ్రి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తల్లీకూతుళ్లు ఇద్దరు గ్రామంలో నివసిస్తున్నారు. తొమ్మిది తరగతి చదువుతున్న బాలిక బహిర్భూమికి వెళ్లింది. గ్రామ శివారులో వెళ్లిన తరువాత బాలికను ఎడ్డాని పవన్ అనే యువకుడు చెట్ల పొదల్లొకి లాక్కెళ్లాడు. అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేశాడు. జరిగిన విషయం బాలిక తన తల్లికి చెప్పడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకుంటామని ఎస్ఐ నాగన్న తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News