Tuesday, September 10, 2024

ఢిల్లీ మెట్రోలో దేవెగౌడ ప్రయాణం

- Advertisement -
- Advertisement -

జనతాదళ్ (సెక్యులర్ ) పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ఢిల్లీ మెట్రోలో ఆదివారం కాసేపు ప్రయాణించారు. దీనికి తోటి ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెట్రో సేవల గురించి అధికారులను దేవెగౌడ అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రుల మ్యూజియంను దేవగౌడ శనివారం సందర్శించారు. “ ఇదొక అపూర్వమైన అనుభవం.

దేశాభివృద్ధికి మన ప్రధానులు అందించిన సహకారం, వారి భిన్న నేపథ్యాలను తెలియజేస్తూ ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం అభినందనీయం ” అని దేవెగౌడ తన అనుభూతిని తెలియజేశారు. కర్ణాటక లోని మారుమూల గ్రామం పేద రైతు కుటుంబానికి చెందిన నేను దేశ ప్రధాని కావడానికి, ఈ మ్యూజియంలో చోటు దక్కించుకోడానికి ప్రజలే అండదండలందించారని దేవెగౌడ భావోద్వేగం వెలిబుచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News