Friday, September 20, 2024

హిమాచల్‌ప్రదేశ్‌లో వరదలకు 11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

హిమాచల్ ప్రదేశ్‌లో వరదలకు ఇప్పటివరకు 11 మంది చనిపోయారని గుర్తించగా, 40 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. జాగిలాలు, డ్రోన్లతో సహా మొత్తం 410 మంది ఈ గాలింపు చేపట్టారు. సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఐడీబిఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు రంగం లోకి దిగి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. కుంభవృష్టి ఫలితంగా కులు లోని నిర్మాండ్, సాయింజ్,

మలానాతోపాటు మండీ లోని పదార్, సిమ్లా లోని రాంపుర్ డివిజన్లలో వరదలు సంభవించాయి. మణికరన్ ప్రాంతం లోని మలానా 2 ప్రాజెక్టులో 33 మంది చిక్కుకోగా, వారిని రెస్కూ బృందాలు రక్షించాయి. సిమ్లా లోని రాంపుర్‌లో దాదాపు 20 నుంచి 25 ఇళ్లు కొట్టుకుపోయాయి. 30 మంది గల్లంతయ్యారు. మొత్తం 40 మంది ఆచూకీ లభించలేదు. ఇప్పుడు వరద నీరు కాస్త తగ్గడంతో సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో ఇంతవరకు 79 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News