Sunday, April 28, 2024

తొమ్మిదేళ్లలో అన్నిరంగాలు అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ రూరల్: తెలంగాణ వచ్చిన 9 ఏళ్లలో అన్నిరంగాల్లో వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం హవేళిఘనాపూర్ మండలంలో దాత సహకారంతో 30 లక్షల వ్యయంతో మండల పరిషత్ పాఠశాల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను వరండాను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్దించి 70 ఏళ్లలో వివిధ ప్రభుత్వాలు వచ్చిన సాధించని ప్రగతి, ఈ తోమిదేళ్ళలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నదని, అన్నిరంగాల్లో సాధించిన విజయాలు చెప్పడానికే ఒక్కో రంగంపై 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

అందులో భాగంగా నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ వచ్చాక మన ఊరు మన బడి ద్వారా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా 12 కాంపోనెంట్ పనులను చేపట్టి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, సుశిక్షితులైన ఉపాధ్యాయులచే బోధన చేస్తున్నామని అన్నారు. గొప్పింటి పిల్లలు కార్పొరేట్ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుచున్న వారిని చూస్తున్న పేదలు తాము తిన్నా తినక పోయిన తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివించాలని కాంక్షతో ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపిస్తున్నారని అది గమనించిన ప్రబంహుత్వం వారికి వెసులుబాటు కల్పించాలనే ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నదని అన్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, సన్న బియ్యం భోజనంతోపాటు నేటి నుంచి రాగి జావ అందిస్తున్నదని అన్నారు.

నేటి కంప్యూటర్ యుగం లో పోటీ పడాలంటే అంగాల మాధ్యమంలో చదివే పరిస్థితి వచ్చిందని, ఆ దిశగా ప్రభుత్వం ఆంగ్ల మధ్యమ పాఠశాలలను ఏర్పాటు చేసిందని అన్నారు. విద్య అన్నింటికీ మూలం అని, ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు . పిల్లలకు పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించుటకు దాతలు కూడా ముందుకు వస్తున్నారని, ఇక్కడా రెండు అదనపు తరగతి గదులు, వరండా నిర్మించుటకు ప్రముఖ పారిశ్రామిక వేత్త సుభాష్ రెడ్డి 30 లక్షలు ఇవ్వడం ముదావహమని అన్నారు. ప్రభుత్వం మన ఊరు మన బడి క్రింద మొదటి దశలో జిల్లాలో 313 పాఠశాలలను ఎంపిక చేసి 12 కాంపోనెంట్ పనులు చేపట్టిందని, పనులు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మన ఊరు మన బడి కింద ఈ రోజు జిల్లాలో 15 పాఠశాలలను అన్ని వసతులతో ప్రారంభించుకుంటున్నామన్నారు.

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో కార్పొరేట్ పాఠశాలల మాదిరి నేడు ప్రభుత్వ బడులు తయారయ్యాయని త్వరలో అన్ని అందుబాటులోకి వస్తాయని అన్నారు. విద్య ప్రాముఖ్యతను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను కనీస వసతులతో మెరుగుపర్చాలనే ఆలోచనతో మూడు దశలలో చేపడుచున్నదని అన్నారు. పాఠశాలల మరమ్మతులకు స్కూల్ మేనేజిమెంట్ కమిటీ, సర్పంచులు బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నందున చదువుపై ప్రత్యేక దృష్టికి పెట్టాలని అన్నారు. ఈ కార్యకమ్రంలో పంచాయత్ రాజ్ ఈ ఈ సత్యనారాయణ రెడ్డి, డిఈఓ రాధాకిషన్, ఎంఈఓ నీలకంఠం, ఎంపిపి శేరి నారాయణ రెడ్డి, సర్పంచు, జెడ్పిటిసి, ,ఎంపిటిసి సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News