Sunday, June 23, 2024

యాత్రికుల మేడగా జాతర

- Advertisement -
- Advertisement -

Medaram jatara

 

మేడారం జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు కల్గించాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి : మంత్రులు

ములుగు జిల్లా : రానున్న మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి అసౌక ర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను సూచించిన గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలో పర్యటించారు. అమ్మవార్ల దర్శన అనంతరం జాతర పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జంపన్న వాగులో ఏర్పాటు చేసిన స్నానపు ఘట్టాలను ప్రారంభించారు. భక్తులు దుస్తు లు మార్చుకోవడానికి నిర్మించిన గదులను, తాత్కాలిక మరుగుదొడ్లను పరిశీ లించారు. జంపన్న వాగులో భక్తులు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా, వాటర్ లెవెల్స్ అంతటా ఒకే విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రమాద ప్రదేశాలను గుర్తించి, రక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రమాద బోర్డులను ఏర్పాటు చేయాలని, గస్తీకి సిబ్బందిని నియమించాలని ఆదేశించా రు. అనంతరం హరిత హోటల్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆర్‌డబ్లూఎస్ అధికారులు జనవరి 15వ తేదీ లోపు మరుగుదొడ్లు, తాగునీటి వసతి, స్నాన ఘట్టాల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల వేగవంతానికి కూలీలు, యంత్రాల సంఖ్యను పెంచా లన్నారు. ప్లాస్టిక్ రహిత జాతరగా, పర్యావరణ హితంగా ఉండాలన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన బట్ట సంచులు, పోచంపల్లి కాటన్ సంచులను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలి పారు. ఫ్లెక్సీల స్థానంలో క్లాత్ బ్యానర్లను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ కుంభమేళాగా పిలిచే ఈ జాతరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, నాయకులను ఆహ్వానిస్తున్నా మన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ హైదరాబాద్, వరంగల్ హైవే నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగం పెంచి జాతర నాటికి పూర్తి చేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అధి కారులు, జాతర కవరేజీకి వచ్చే మీడియా సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకు ండా చూడాలన్నారు. పాలక మండలి పూర్తి స్థాయి బాధ్యతతో పని చేయాలన్నారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మేడారం జాతర ప్రపంచ ప్రసిద్ధి చెందినదని, 1.30కోట్ల మంది భక్తులు వస్తారని, ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పార్కింగ్ కోసం రైతులు ఇచ్చిన పొలాలను జాతర అనంతరం సాగుకు ఉపయోగపడేలా చేసి ఇస్తామన్నారు. ప్రసాదం కోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే వాటి సంఖ్య పెంచాలని ఆదేశించారు. అనంతరం మేడారం అధికారిక యాప్‌ను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపి పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాషరావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు ధనసరి అనసూయ, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, జడ్పి చైర్మన్, చైర్‌పర్సన్లు కుసుమ జగదీశ్వర్, గండ్ర జ్యోతి, జక్కు శ్రీహర్షిణి, హిమ బిందు, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా, టూరిజం ఎండి క్రిష్టినా, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వరంగల్ రేంజ్ ఐజి నాగిరెడ్డి, జిల్లా ఎస్పి సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పాల్గొన్నారు.

Devotees provided with facilities in Medaram jatara
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News