Saturday, June 3, 2023

నెట్స్‌లో ధోనీ, జడేజా సందడి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ మరో వారం రోజుల్లో ఆరంభం కానుంది. డిఫెండింగ్ గుజరాత్ టైటాన్స్‌తో నాలుగుసార్లు టైటిల్ కైవసం చేసుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌లో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. భారతజట్టు మాజీ కెప్టెన్ ధోనీని మైదానంలో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ధోనీ తాజా సీజన్‌లో చెన్నై జట్టుకు సారథ్యం వహించనున్నాడు.

గత సీజన్‌లో ధోనీ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా వదిలి అతడి స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టు పగ్గాలు అందించాడు. అయితే పేలవ ప్రదర్శనతో సీజన్ మధ్యలోనే జడేజా కెప్టెన్సీని వదులుకోవడంతో ధోనీ మళ్లీ సీఎస్‌కే సారథిగా వ్యవహరించాడు. ఈనేపథ్యంలో జడేజా, ధోనీ మధ్య విభేదాలు ఉన్నాయన్న ఊహాగానాలకు తెరదించుతూ సిఎస్‌కె యాజమాన్యం ధోనీ, జడేజా నెట్ సెషన్‌లో సందడి చేస్తున్న ఫొటోను అభిమానులకు షేర్ చేసింది. కాగా ఐపీఎల్ వేలంలో సిఎస్‌కె బెన్‌స్టోక్స్‌ను రూ.16.25కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఐపిఎల్ చరిత్రలో సిఎస్‌కె అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్న దీపక్ చాహర్‌ను బెన్‌స్టోక్స్ అధిగమించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News