Sunday, April 28, 2024

మీరు రాజకీయాల నుంచి గవర్నర్ కాలేదా?

- Advertisement -
- Advertisement -
తమిళిసై తీరుపై భగ్గుమన్న మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎంఎల్‌సిలుగా కేబినెట్ సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళి సై మంచి మనసుతో ఆలోచించి ఉంటే కేబినెట్ సిఫా ర్సు చేసిన ఇద్దరు అభ్యర్థులను తిరస్కరించేవారు కాదు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నవారిని సిఫార్సు చేయవద్దని గవర్నర్ అన్నారు..మరి తమిళిసై గవర్నర్ అయ్యే ముందు వరకూ తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా చేయలేదా..? అని ప్రశ్నించారు. ఆమె కూడా రాజకీయ నాయకురాలే కదా..? అని అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మంత్రి బిఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ, ఎంఎల్‌ఎలు బాల్కసుమన్, సైదిరెడ్డి, గోపినాథ్, ఎంపి వెంకటేష్ నేత తదితరులతో కలిసి మంగళవారం మంత్రి కెటిఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ కోటా ఎంఎల్‌సిలుగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రజా ఉద్యమాల్లో పని చేసిన వారిని తమ కేబినెట్ నామినేట్ చేసిందని తెలిపారు. గవర్నర్ కోటాలో ఎంఎల్‌సిలుగా కేబినెట్ సిఫార్సు చేసిన ఇద్దరు అన్‌ఫిట్ అనే పదం గవర్నర్ వాడారని, ఎవరు అన్‌ఫిట్…గవర్నరా..?..మోడీనా అని కెటిఆర్ ప్రశ్నించారు. క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న వారు గవర్నర్లుగా రాకూడదని సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్పింది, ఆ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కి బిజెపి పార్టీ వారి పార్టీకి చెందిన వారిని గవర్నర్లుగా నియమించిందని అన్నారు. బలహీన వర్గాలకు చెందిన బలమైన గొంతుకలను శాసనమండలికి తీసుకువస్తామంటే మీకేం బాధ..? అని నిలదీశారు. దాసోజు శ్రవణ్ ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమంతో సహా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. గవర్నర్‌కు తమ మీద ఉన్నంత కోపం.. దాసోజు శ్రవణ్ మీద ఉండదని అనుకున్నామని, ఎందుకంటే ఆయన మంచి ప్రొఫెసర్… మంచివాడు అని ఆమోదిస్తారని అనుకున్నామని చెప్పారు. సత్యనారాయణ అయితే ఎస్‌టి కేటగిరీకి చెందిన ఎరుకల కమ్యూనిటీ నాయకుడు అని, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా జాతీయ స్థాయిలో పని చేశారని తెలిపారు. ట్రేడ్ యూనియన్‌లో చేసిన సేవలకు జనరల్ ని యోజకవర్గంలో ఆయనను ప్రజలు గెలిపించారని గుర్తు చేశా రు. ఈ ఇద్దరి నేపథ్యాన్ని మనసుతో ఆలోచించి ఉంటే గవర్నర్ నిర్ణయం ఇలా రాకపోయేదని పేర్కొన్నారు. ప్రధాని మోడీతో పాటు ఆయన ఏజెంట్లు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కేవిధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నవారిని ఇలాంటి పదవుల్లోకి తీసుకురావొద్దని లేఖ రాశారని, అంతకంటే హాస్యాస్పదమైన మాట ఇంకోటి లేదని అన్నారు.
వలస పాలనకు చిహ్నమైన గవర్నర్ వ్యవస్థ ఎందుకు
గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఇప్పటికీ బిజెపి నేతగానే వ్యవహరిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. తెలంగాణలోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని అన్నా రు. తమిళనాడు గవర్నర్ తమిళనాడు పేరును మార్చేస్తా రు…ఇంకో గవర్నరేమో సిఎంకు సంబంధం లేకుండా నిర్ణయాలను తీసుకుంటారని ఉదహరించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ప్రాధాన్యత లేకపోతే ఎలా..? అని ప్రశ్నించారు. గవర్నర్లు.. మోదీ ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో క్రియాశీల రాజకీయాలలో ఉన్న అనేక మంది నేతలు ఎంఎల్‌సిలు అయ్యారని చెప్పారు. జ్యోతిరాదిత్య సింధియా సహా ఎంతోమంది క్రియాశీల రాజకీయాలలో ఉన్న వారు రాజ్యసభ సభ్యులుగా, ఎంఎల్‌సిలుగా నామినేట్ అయ్యారని పేర్కొన్నారు. వలస పాలనకు చిహ్నమైన గవర్నర్ వ్యవస్థను మోడీ ఎందుకు రద్దు చేయరని ప్రశ్నించారు. ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులో ప్రజలు మాత్రమే తేలుస్తారని అన్నారు. మోడీ కూడా ప్రధాని పదవిని వైశ్రాయ్‌గా మార్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో గవర్నర్ పోస్టు అవసరమా..? అని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని, ప్రజల చేతు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేయడం సరికాదని హితవు పలికారు. కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులను ఎంఎల్‌సిలుగా చేయడంలో అక్కడి బిజెపి గవర్నర్ సహకరిస్తారని, బిజెపిపాలిత రాష్ట్రాల్లో కూడా అర్హత లేని వారిని నామినేట్ చేస్తారని అన్నారు. ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయని ఆరోపించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఒక నీతి అని, మిగతా పార్టీలకు ఒక నీతి ఉంటుందా..? అని ప్రశ్నించారు.
పాలమూరులో కాలు మోపే నైతిక హక్కు మోడీకి లేదు
కృష్ణా జలాల్లో వాటా తేల్చని ప్రధాని నరేంద్ర మోడీకి పాలమూరు జిల్లాలో కాలు మోపే నైతిక హక్కు లేదని మంత్రి కె టిఆర్ అన్నారు.కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టిఎంసిలు దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. అక్టోబర్ 1వ తేదీన పాలమూరు జిల్లా పర్యటనకు వస్తున్న మోడీపై కెటిఆర్ నిప్పులు చెరిగారు. పాలమూరు వలసల జిల్లా అనే నానుడి ఉంది.. దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన పాలమూరు జిల్లాకు ప్రధాని ఏం చేయలేదని గుర్తు చేశారు. 2014 జూన్ 2న తెలంగాణ వస్తే జులై 14న ఓ లేఖ తీసుకుని సిఎం కెసిఆర్ ప్రధాని దగ్గరకు వెళ్లి, నీళ్లలో జరిగిన అన్యాయం గురించి వివరించారని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలల్లో మా వాటా తేల్చాలని, అప్పుడే న్యాయబద్దమైన వాటా దక్కుతుందని కోరామన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు సహకరించండి, జాతీయ హోదా ఇవ్వాలని కోరామని పే ర్కొన్నారు. కాళేశ్వరం లేదా పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు అడిగామని గుర్తు చేశారు. కరువులు, కన్నీళ్లు, వలసలతో గోసపడ్డ పాలమూరు ఇప్పుడే పచ్చబడుతుంటే.. ప్రధాన మంత్రి, ఆయన పార్టీ పగబట్టిందని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చకపోగా, మరోవైపు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదని చెప్పారు. అప్ప ర్ భద్రకు, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును పక్కనపెట్టారని ధ్వజమెత్తారు. పాలమూరు గడ్డ మీద కాలుపెట్టే ముందు పాలమూరు ప్రజలకు నదీ జలాల వాటాపై స్ప ష్టత ఇవ్వాలని అన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చుతామని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ ఒక్కో రా ష్ట్రానికి ఒక్కో విధానాన్ని అవలంభిస్తుందని విమర్శించారు. అసలు బిజెపి పార్టీ జాతీయ పార్టీనా..? కాదా..? స్పష్టం చే యాలని నిలదీశారు. తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, ద్రో హం చేసిన దగుల్బాజీ పార్టీ బిజెపి అని కెటిఆర్ మండిపడ్డా రు. పాలమూరు పచ్చబడుతుంటే బిజెపి నేతలకు కళ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని అడిగాం.. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణపై పగబట్టాయని ఆవేదన వ్యక్తం చేవారు.
ఒక్క సంతకం పెట్టే తీరిక లేదా..?
పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇస్తామని గతంలో బిజెపి నాయకులు చెప్పారని కెటిఆర్ గుర్తు చేశారు. పర్యావరణ, ఇతర సాంకేతిక అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారని, దీనికి మీరు బాధ్యులు కాదా..? అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చమని ట్రిబ్యునల్‌కు రెఫర్ చేయడానికి ఎం దుకు మనసు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క మాట, ఒక్క సంతకం పెట్టే తీరిక లేదా..? అని ప్రశ్నించారు. ఈ నికృష్ట రాజకీయం ఎందుకని మోదీని కెటిఆర్ నిలదీశారు.
575 టిఎంసిలు మాకు దక్కాలనేది మా వాదన
తెలంగాణ రాష్ట్రం వచ్చిన 40 రోజులకే కృష్ణా జలాల కేటాయింపులపై కేంద్రానికి సిఎం కెసిఆర్ లేఖ రాశారని కెటిఆర్ గుర్తు చేశారు. కేంద్రం స్పందించకపోతే ఏడాది వరకు వేచి చూశామని, 2015, ఆగస్టు 10వ తేదీన తమ ప్రభుత్వం సు ప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేసిందని చెప్పారు. 2020, అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్‌లో కేంద్రాన్ని, జలవనరు ల శాఖను కెసిఆర్ గట్టిగా నిలదీశారని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని అడిగితే.. కేసు ఉపసంహరించుకోమని సూచించారని, తీరా కేసు ఉపసంహరించుకున్న తర్వాత.. ఈ రోజు వరకు కనీసం ఉత్తరం రాసిన పాపాన పోలేదని చెప్పారు. అప్పుడు కేంద్రం మాటలు నమ్మి మోసపోయామని అన్నారు. కృష్ణా జలాల్లో 811 టిఎంసిలను ఉమ్మడికి ఎపికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిందని, 575 టిఎంసిలు తెలంగాణకు దక్కాలనేది తమ వాదన అని పేర్కొన్నారు. ట్రిబ్యునల్‌కు ఉత్తరం రాయకుండా ప్రధాని పాలమూరులో ఎలా అడుగుతపెడుతారని ప్రశ్నించారు. మోదీ నిర్వాకం వల్ల నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు వందల టిఎంసిల నీటిని కోల్పోతున్నాయని తెలిపారు.
ఓట్ల వేట కోసమే మోడీ పర్యటన
తెంలగాణలో ఓట్ల వేట కోసమే ప్రధాని మోడీ తెలంగాణకు వస్తున్నారని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. ఓట్లు కావాలంటే కూడా చేసిన మంచి పనులు చెప్పాలని, మాటలు చెబితే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మోడీ వచ్చిన సమయంలో ఎపికి ఏమో ఇస్తారని అందరూ ఆశించారని, కానీ తట్టెడు మట్టి ఇచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీ చేతులతో రావడం పోవడం ప్రధానికి అలవాటే అని, వగల ప్రేమలు వలకబోసినా, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా.. మిమ్మల్ని, మీ పార్టీని నమ్మరని మోడీని, బిజెపి పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బిజెపి పార్టీకి మళ్లీ డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సారైనా ప్రధాని మోడీ స్పందించి, పాప పరిహారం చేసుకుంటారని, ఆ ప్రకాక్షళనలో భాగంగా తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఇవ్వాలని బిఆర్‌ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామని కెటిఆర్ తెలిపారు. జమిలి ఎన్నికలు రాజకీయ గిమ్మిక్కు మాత్రమేనని కెటిఆర్ అ భిప్రాయపడ్డారు.ప్రధాని మోడీ కీలక అంశాలను డైవర్ట్ చేయడంలో మాస్టర్ మైండ్ అని, వన్ నేషన్..వన్ ఎలక్షన్ కూడా అలాంటిదే అని ఆరోపించారు. కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలలో బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి గురించి మాట్లాడటం వేస్ట్..
కిషన్ రెడ్డి మోస్ట్ అన్‌ఫిట్ లీడర్ అంటూ కెటిఆర్ వ్యాఖ్యానించారు. అయినా ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ అ సహనం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి వెళుతున్నారని విలేకరులు ప్రశ్నించగా, ఎన్నికల సమయంలో నేత లు పార్టీలు మారడం సహజనమని అన్నారు.రేపు కాంగ్రెస్ వాళ్లు కూడా బిఆర్‌ఎస్ పార్టీలోకి వస్తారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News