Monday, March 4, 2024

మణిపూర్‌ని సందర్శించలేదు.. క్రికెట్ కోసం అహ్మదాబాద్ వెళ్లారు

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ధ్వజం

జైపూర్ : హింసాకాండతో భగ్గుమన్న మణిపూర్‌ను ఇంతవరకు ప్రధాని మోడీ సందర్శించలేదు కానీ క్రికెట్ మ్యాచ్ చూడడానికి అహ్మదాబాద్ వెళ్లారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో షాపురా ర్యాలీలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఫకీరుగా తనకు తాను మోడీ చెప్పుకుంటారని, కానీ ఆయన పాలనలో బీజేపీ ఏ విధంగా అత్యధిక ధనవంతురాలిగా తయారైందో చెప్పాలన్నారు.

దాదాపు ఏడు నెలలుగా మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతుంటే ఇంతవరకు ప్రధాని మోడీ మణిపూర్‌ను సందర్శించలేదని, దానికి బదులు అహ్మదాబాద్ స్టేడియంకు క్రికెట్ చూడడానికి వెళ్లేందుకు తీరిక దొరికిందని ఎద్దేవా చేశారు. బడా పారిశ్రామిక వేత్తల రుణాలను మాఫీ చేసిన మోడీ పేద ప్రజను నిర్లక్షం చేశారని ఆరోపించారు. బీజేపీ పాలిత కేంద్రం, రాష్ట్రాలు బడా పారిశ్రామిక వేత్తల కోసం పనిచేస్తున్నాయని, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఊరట కలిగించారని పోల్చి చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు మనీష్ యాదవ్, ఇంద్రాజ్ గుర్జార్‌లకు మద్దతుగా ప్రియాంక బహిరంగ సభల్లో ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News