Monday, April 29, 2024

మూడు దశాబ్దాల తర్వాత ఎన్నికల బరిలోకి దిగ్విజయ్ సింగ్

- Advertisement -
- Advertisement -

భోపాల్: కాంగ్రెస్ అధికారిక జాబితా ఇంకా వెలువడక ముందే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తాను రాజ్ గఢ్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఆయన మూడ దశాబ్దాల తర్వాత తన స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. లోక్ సభ స్థానాలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ నాయకులు వెరుస్తున్నారని బిజెపి ఆరోపించడంతో ఆయన ఈ ప్రకటన చేశారు.

బిజెపి ఆరోపణను తిప్పికొట్టిన దిగ్విజయ్ సింగ్ ‘‘ నేను ప్రధాని నరేంద్ర మోడీ లేక శివరాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి)పై కూడా తలపడడానికి సిద్ధం. కానీ మా పార్టీ నన్ను రాజ్ గఢ్ నుంచి పోటీచేయమంది. కనుక నేను ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నాను’’ అని స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ 1993 నుంచి 2003 వరకు సిఎంగా పనిచేశాక ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News