Thursday, May 9, 2024

యూరప్‌లో రియల్ గన్స్‌తో షూట్ చేశాం

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టయిలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం ఈగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

అద్భుతమైన యాక్షన్ డ్రామా…
‘ఈగల్’ కాన్సెప్ట్‌లోనే విధ్వంసం వుంది. ఇది లార్జర్ దెన్ లైఫ్ ఎంటర్‌టైనర్. అతని విధ్వంసం సమాజం కోసమే. అదేమిటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో కథానాయకుడు పత్తిపండించే రైతులా వుంటారు. అయితే అతను పోరాడుతున్న సమస్య అంతర్జాతీయంగా ఉంటుంది. రాంబో, టెర్మినేటర్ లాంటి సినిమాలని చాలా ఎంజాయ్ చేస్తాం. అలాంటి ఒక సినిమా తీసుకురావాలనే ప్రయత్నమే ఇది. ఈగల్… అద్భుతమైన యాక్షన్ డ్రామా ఎంటర్‌టైనర్. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దామన్నారు…
-రవితేజతో ’ధమాకా’ సినిమాకి కెమెరామ్యాన్‌గా పని చేస్తున్న సమయంలో ఈ కథ ఆయనకి చెప్పాను. ఆయన కథ విన్న వెంటనే ..‘ఇది మంచి కమర్షియల్ సినిమా.. చేసేద్దాం’అన్నారు. -రవితేజ బ్రిలియంట్ యాక్టరని అందరికీ తెలుసు. కానీ కొన్ని సార్లు కమర్షియల్ కారణాల వలన ఒకే సినిమాలో కామెడీ, డ్యాన్స్, యాక్షన్… ఇలా చాలా రకాలు చేయాల్సివస్తుంది. ఈగల్ సినిమాలో మాత్రం ఆయన ఒక క్యారెక్టర్‌లానే కనిపిస్తారు.
హిందీలో ‘సహదేవ్ వర్మ’గా…
-ఈగల్ నాలుగు కిలోమీటర్ల ఎత్తులో వున్నా కిందవున్న కుందేల్‌ని చూడగలదు. ఇందులో హీరోకి ఆ ఐ పవర్ వుంది. అలాగే ఈ పాత్రకు సినిమాలో కోడ్ నేమ్ కూడా ఈగల్. హిందీలో కూడా ఈ పేరు పెట్టడానికి ప్రయత్నించాం. ఇదే పేరుతో అక్కడ ఓ సినిమా వుంది. దీంతో ఈ కథలో హీరో పేరు ‘సహదేవ్ వర్మ’ టైటిల్‌తో హిందీలో విడుదల చేస్తున్నాం.
క్లైమాక్స్ చాలా అద్భుతంగా…
ఈగల్ సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్‌ని వారం రోజుల్లో తీసేయవచ్చని అనుకున్నాను. కానీ అది 17 రాత్రిళ్ళు పట్టింది. దాని కోసం అన్ని రియల్ ఎఫెక్ట్‌ని ప్రయత్నించాం. క్లైమాక్స్ చాలా అద్భుతంగా వచ్చింది.
రియల్ గన్స్‌తో షూట్ చేసి…
-ఈగల్ సినిమా సౌండ్ డిజైన్ ఆరు నెలలు చేశాం. యూరప్‌లో రియల్ గన్స్‌తో షూట్ చేసి ఆ సౌండ్‌ని రికార్డ్ చేశాం. నేపధ్య సంగీతంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మంచి థియేటర్లో చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫీల్ అవ్వొచ్చు. డేవ్ జాండ్ పదేళ్ళుగా తెలుసు. తనతో మంచి జర్నీ వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News