అమరావతి: జిఎస్టి సంస్కరణలు.. పేదల జీవితాల్లో ప్రభావం చూపుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో సిఎస్టి, వ్యాట్ వంటి పన్నుల విధానం ఉండేదని అన్నారు. జిఎస్టి సంస్కరణలపై ఎపి శాసన సభలో చర్చ జరిగింది. ఈ సభలో సిఎం మాట్లాడుతూ..గతంలో 17 రకాల పన్నులు, 13 రకాల సర్ ఛార్జ్ లు ఉండేవని, వాజ్ పేయీ హయంలో జిఎస్టి సంస్కరణలు తీసుకువచ్చారని తెలియజేశారు. అందరినీ ఒప్పించి అరుణ్ జైట్లీ జిఎస్టి సంస్కరణలను అమలు చేశారని, జిఎస్టి అమలు.. గేమ్ ఛేంజర్ గా మారిందని అన్నారు. జిఎస్టి రెండో తరం సంస్కరణలు తీసుకువచ్చారని, సంస్కరణలకు తానెప్పుడు ముందుంటానని పేర్కొన్నారు. అభివృద్ది జరిగితేనే సంపద సృష్టి.. ప్రభుత్వానికి ఆదాయం అని ప్రభుత్వానికి ఆదాయం వస్తే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని సంపద సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదని, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదనేది తన నమ్మకాన్నిచంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read : రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా?: పేర్నినాని