Sunday, December 3, 2023

పల్లె ప్రగతితో పల్లెల్లో వ్యాధులు తగ్గుముఖం

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: పల్లె ప్రగతితో తెలంగాణ పల్లెలు అద్భుతంగా అభివృద్ధి చెంది, వ్యాధులు తగ్గుముఖం పట్టామని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.గురువారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలో చర్లభూత్కూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గతంలో ప్రజలు నీటి కోసం అనే కష్టాలు అనుభవించారన్నారు.

దూర ప్రాంతాలకు ఓయ్ త్రాగునీరు మోసుకొని తీసుకుని వచ్చే దుస్థితి ఉండేదని, గ్రామపంచాయతీకి కార్యదర్శి లేకపోవడంతో గ్రామస్థాయి పాలన కుంటుపడిందన్నారు. పారి శుధ్య కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లించడంలో వారు మనస్ఫూర్తిగా పనిచేయలేకపోయినారని, చెత్త నిర్వహణకు సరైన ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడపడితే అక్కడ చెత్తను పారబోసే వారిని, మరణించిన తమ వారి అంత్యక్రియలు చేపడానికి కావలసిన వసతులు లేక గతంలో గ్రామీణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భావం తరువాత గ్రామాలలో ఇలాంటి దుర్భర పరిస్థితి ఉండరాదని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గ్రామాలలో పారిశుధ్యం నిరంతరం కొనసాగించడానికి, గ్రామంలోని చెత్తాచెదారం సేకరించడానికి వాటిని తరలించడానికి గ్రామంలో మొక్కలు సం రక్షించడానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ నువ్వు సమకూర్చడం జరిగిందన్నారు.

సేకరించిన తడి చెత్తను కంపోస్ట్ గా మార్చడానికి పొడి చెత్తను నిర్వహించడానికి ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడమైనది. మరణించిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపేందుకు వైకుంఠధామం నిర్మించిన తొలి రాష్ట్రం తెలంగాణ. అంటువ్యాధులు అరికట్టడానికి మిషన్ భగీరథ రూప కల్పన చేసి ఇంటింటికి నల్ల ద్వారా శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేస్తున్నాం. పల్లె ప్రగతి కార్యక్రమం తో కొత్త విద్యుత్ స్తంభాలు అమర్చి, వంగిపోయిన తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేసి, వదులుగా దీగ నన్ను పటిష్ట పరచడం జరిగిం ది. హరితహారంలో ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.

పారిశుధ్య నిర్వహణకు అవసరమైన పారిశుద్ధ్య కార్మికులు ఉంటేనే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచగలమని గమనించిన ప్రభుత్వం ప్రతి 500 జనాభాకు ఒక మల్టీ పర్పస్ వర్కర్ ను నియ మించడంతోపాటు వారి వేతనాలను రూ. 8500 పెంచడం జరిగింది. ఇది వేల వెయ్యి రూపాయలు పెంచి రూ 9500/- చేసింది. పక్కనే గోదావరి ఉన్న చెరువులు ఎండిపోయవని, గతంలో బిందె మీద బిందె పెట్టి మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి నడిచి ప్రజలు త్రాగునీరు తెచ్చుకునే వారని రైతులు మొగులు చూసి దుక్కి దున్నేవారని, కరెంటు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా తెలియని పరిస్థితి ఉండేదన్నారు.

రైతు పొలం దగ్గర కరెంటు కోసం వేచి చూసేవాడని, మోటార్లు ట్రాన్స్ఫర్లు కాలిపోయేవని ,పంటలు ఎండి పోయి షావుకారు దగ్గర తీసుకున్న అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్య చేసుకునే వారిని, గతంలో బీడుభూములు, నెర్రెలు బారిన చెరువులు ఉండ్వేని,తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మండుటెండల్లో సైతం నీళ్లు మత్తడి దూకుతున్నాయని, భూమికి బరువు అయి నంత అద్భుతమైన, నాణ్యమైన పంటలు పండుతున్నాయని అన్నారు.

అన్ని వర్గాలు క్షేమంగా బతకాలనే ఉద్దేశంతో కెసిఆర్ రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, దళిత బంధు, యాదవులకు గొర్రెలు, మత్స్యకారులకు ఉచిత చేప పిల్లలు, కులవృత్తులకు అనేక పథ కాలు ప్రజల అభివృద్ధే లక్ష్యంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి సత్కరించారు.

ఈ కా ర్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్, ఎంపీపీ టి.లక్ష్మయ్య, ఫ్యాక్స్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, సర్పంచ్ డి రమణారెడ్డి,రుద్ర భారతి, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డి ఆర్ డి ఓ శ్రీలత, పంచాయతీ ఈ ఈ శ్రీనివాసరావు, జడ్పిటిసి, ప్రజా ప్రతినిధులు,, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News